తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీకు మొబైల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? ఈ టాప్​-7 ఫోన్లపై ఓ లుక్కేయండి! - The Best Camera Phone 2024 - THE BEST CAMERA PHONE 2024

The Best Camera Phone 2024 : మీకు మొబైల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? ఇందుకోసం బెస్ట్ కెమెరా ఫోన్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్​-10 బెస్ట్ కెమెరా ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

The Best Camera Phones You Can Buy in 2024
TOP 5 Best Camera Phones (2024) (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 5:31 PM IST

The Best Camera Phone 2024 : ప్రొఫెషనల్​ కెమెరాలతో పోల్చితే, మొబైల్ ఫోన్లు అంత క్వాలిటీగా ఉండవు. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫోన్లలో హై క్వాలిటీ కెమెరాలు వస్తున్నాయి. ఇవి 10X జూమ్​, హై రేంజ్​, మల్టీ, వెర్సటైల్ లెన్స్​, ఫోటో మోడ్స్​, ఏఐ ఫీచర్స్​తో వస్తున్నాయి. వీటితో సెల్ఫీ, పోట్రైట్​ షాట్స్​ నచ్చినట్లు తీసుకోవచ్చు. కనుక మొబైల్ ఫొటోగ్రఫీ చేసేవారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

యాపిల్​, గూగుల్, శాంసంగ్ ఫోన్లలోని కెమెరాలు చాలా హైక్వాలిటీ ఫొటోలు తీయడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో హైఎండ్ ఫోన్ల నుంచి అఫర్డబుల్ ధరల్లో లభిస్తున్న టాప్​-7 బెస్ట్ కెమెరా ఫోన్ల గురించి తెలుసుకుందాం.

1. Samsung Galaxy S24 Ultra :ఫొటోగ్రఫీ లవర్స్​కు 'శాంసంగ్​ గెలాక్సీ ఎస్​25 ఆల్ట్రా' బెస్ట్ ఛాయిస్ అవుతుంది. పగలైనా, రాత్రైనా, వాస్తవానికి ఎలాంటి సమయంలో అయినా దీనితో మంచి క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. పైగా ఇవి చాలా నేచురల్​గా ఉంటాయి. ఇందులోని 200 ఎంపీ కెమెరా డైనమిక్ రేంజ్​ కలిగి ఉంటుంది. దీనితో తీసిన ఫొటోల్లో బ్యాక్​గ్రౌంట్ బ్లర్ అవుతుంది. కనుక మెయిన్ సబ్జెక్ట్ క్రిస్టల్​ క్లియర్​గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా నేచురల్​గా ఉంటాయి. నోయిస్​ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

గెలాక్సీ ఎస్​24 ఆల్ట్రాలోని కెమెరాలు 10X జూమ్​, మల్టీ షూటింగ్ మోడ్స్​, ఆప్షన్స్​ కలిగి ఉంటుంది. ముఖ్యంగా దీనిలో ఫుడ్ మోడ్ అనే ప్రత్యేకమైన ఫీచర్​ ఉంది. దీనితో తీసిన ఆహార పదార్థాల ఫొటోలు చాలా అద్భుతంగా వస్తాయి. దీనితో హై క్వాలిటీ వీడియోలు కూడా తీసుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

  • స్క్రీన్ సైజ్​ : 6.8 అంగుళాలు
  • రిజల్యూషన్​ : QHD+
  • సీపీయూ : స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3
  • ర్యామ్​ : 12 జీబీ
  • స్టోరేజ్ :​ 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్​ కెమెరా : 200 ఎంపీ + 12 ఎంపీ + 10 ఎంపీ + 50 ఎంపీ (టెలీఫొటో విత్​ 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్​​)
  • ఫ్రంట్​ కెమెరా : 12 ఎంపీ

2. IPhone 15 Pro Max : ఐఫోన్ అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. కనుక దీన్ని కళ్లు మూసుకుని కొనుక్కోవచ్చు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్​లో పెరిస్కోప్ టెక్నాలజీ వాడారు. కనుక లెన్స్​లను, మిర్రర్​లను ఫోల్డ్ చేసుకోవచ్చు.​ అంతేకాదు దీనిలో కెమెరా 5X ఆప్టికల్ జూమ్​ కలిగి ఉంటుంది. పైగా ఇది 6-యాక్సిస్​ స్టెబిలైజర్​తో వస్తుంది. కనుక కదులుతున్న ఆబ్జెక్ట్​ను కూడా చాలా క్లియర్​గా షూట్ చేయవచ్చు. వీడియోలు కూడా షేక్ కాకుండా తీసుకోవచ్చు. యాపిల్​ ఫోన్​లోని ప్రోరెస్​ ఫార్మాట్​లో షూట్​ చేసి, హైయెస్ట్ రిజల్యూషన్​, ఫ్రేమ్ రేట్​తో వీడియోలు తీయవచ్చు.

  • స్క్రీన్ సైజ్​ : 6.7 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 2796 x 1290 పిక్సెల్స్​
  • సీపీయూ : ఏ17 ప్రో
  • ర్యామ్​ : 8 జీబీ
  • స్టోరేజ్ :​ 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
  • బ్యాటరీ : 4422 mAh
  • రియర్​ కెమెరా : 48 ఎంపీ + 12 ఎంపీ + 12 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 12 ఎంపీ

3. Google Pixel 8 Pro : ఫొటోగ్రఫీ లవర్స్​కు, సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని కెమెరా లెన్స్​ డిఫరెంట్ అపార్చర్స్​ కేపబిలిటీస్​తో వస్తుంది. కనుక లో-లైట్​లోనూ మంచి ఫొటోలు తీసుకోవచ్చు.

మ్యాక్రో ఫొటోగ్రఫీకి ఈ గూగుల్ పిక్సెల్ 8 ప్రో చాలా బాగుంటుంది. అంతేకాదు దీనిలో తీసిన ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి గూగుల్ ఫొటోస్ అనే యాప్​ కూడా అందుబాటులో ఉంటుంది.

  • స్క్రీన్ సైజ్​ : 6.7 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 1344 x 2992 పిక్సెల్స్​
  • సీపీయూ : గూగుల్ టెన్సర్​ జీ3
  • ర్యామ్​ : 12 జీబీ
  • స్టోరేజ్ :​ 128 జీబీ/ 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
  • బ్యాటరీ : 5,050 mAh
  • రియర్​ కెమెరా : 50 ఎంపీ + 48 ఎంపీ + 48 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 10.5 ఎంపీ

4. Google Pixel 8a :కాస్త తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలని అనుకునేవారికి గూగుల్ పిక్సెల్ 8ఏ మంచి ఛాయిస్​ అవుతుంది. దీనితో మంచి వెలుతురు ఉన్నప్పుడు కలర్​ఫుల్​ ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాజిక్ ఎడిటర్ సాయంతో ఈ ఫొటోల్లోని బ్యాక్​గ్రౌండ్​ను రిమూవ్ చేసుకోవచ్చు. వీడియోలు తీసినప్పుడు బ్యాక్​గ్రౌండ్ నోయిస్​ కూడా ఐసోలేట్ చేసుకోవచ్చు.​

  • స్క్రీన్ సైజ్​ : 6.1 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 1080 x 2400 పిక్సెల్స్​
  • సీపీయూ : గూగుల్ టెన్సర్​ జీ3
  • ర్యామ్​ : 8 జీబీ
  • స్టోరేజ్ :​ 128 జీబీ
  • బ్యాటరీ : 4492 mAh
  • రియర్​ కెమెరా : 64 ఎంపీ + 13 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 13 ఎంపీ

5. IPhone 15 :ఈ ఐఫోన్​లో 2 లెన్స్​లు ఉంటాయి. కానీ ఇది చాలా పవర్​ఫుల్​ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీనిలో చాలా కూల్, ఫొటోగ్రఫీ ఫీచర్స్ ఉన్నాయి. దీనితో 4K 60fps వీడియోస్ తీసుకోవచ్చు. అంటే సినిమాటిక్ మోడ్​లో ఏకంగా హై-క్వాలిటీ సినిమానే తీసేయవచ్చు. అంతే కాదు అతి తక్కువ వెలుతురులోనూ దీనితో హై క్వాలిటీ సెల్ఫీ ఫొటోలు తీసుకోవచ్చు. అంతేకాదు దీనిలో టెలిఫొటో, మ్యాక్రో క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి.

  • స్క్రీన్ సైజ్​ : 6.1 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 2556 x 1176 పిక్సెల్స్​
  • సీపీయూ : ఏ16 బయోనిక్​
  • ర్యామ్​ : 12 జీబీ
  • స్టోరేజ్ :​ 128 జీబీ/ 256 జీబీ/ 512 జీబీ
  • బ్యాటరీ : 3349 mAh
  • రియర్​ కెమెరా : 48 ఎంపీ + 12 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 12 ఎంపీ

6. Google Pixel 8 :గూగుల్ పిక్సెల్​ 8 అనేది ఒక ఎక్స్​లెంట్ ఫోన్​. ఛాలెంజింగ్​ కండిషన్​లోనూ దీనితో చాలా క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. ఆటోఫోకస్​, మల్టీ వీడియో క్యాప్చర్​ మోడ్స్​, ఏఐ క్యాపబిలిటీస్ దీనిలో ఉన్నాయి. అంతేకాదు దీనిలో మ్యాజిక్ ఎడిటర్​ ఉంది. కనుక అఫర్డబుల్ ప్రైజ్​లో లభిస్తున్న బెస్ట్ ఫోన్​గా దీనిని పరిగణించవచ్చు. దీనితో కలర్ అక్యూరసీ, ఎక్స్​పోజర్​, అపార్చర్​, ఎడ్జ్​ డిటెక్షన్​ ఎలిమెంట్స్​తో ఫొటోలు తీసుకోవచ్చు.

  • స్క్రీన్ సైజ్​ : 6.2 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 1080 x 2400 పిక్సెల్స్​
  • సీపీయూ : గూగుల్ టెన్సర్​ జీ3
  • ర్యామ్​ : 8 జీబీ
  • స్టోరేజ్ :​ 128 జీబీ/ 256 జీబీ
  • బ్యాటరీ : 4575 mAh
  • రియర్​ కెమెరా : 50 ఎంపీ + 12 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 10.5 ఎంపీ

7. OnePlus 12 :ఐఫోన్​, గూగుల్ పిక్సెల్​, శాంసంగ్ ఫోన్లకు పోటీగా మార్కెట్లు ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్ 'వన్​ప్లస్​ 12'. ఇందులో ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే ఆప్టిక్స్​ ఉపయోగించారు. దీనితో జా-డ్రాపింగ్​ టెలిఫొటో షాట్స్​, ఎక్స్​ట్రీమ్​ క్లోజ్​-అప్​ మ్యాక్రో ఫొటోలు తీసుకోవచ్చు. అంతే దీనితో ల్యాండ్​స్కేప్​, పోట్రైట్ ఫొటోలు అద్భుతంగా, నేచురల్​గా తీయవచ్చు.

  • స్క్రీన్ సైజ్​ : 6.82 అంగుళాలు
  • రిజల్యూషన్​ : 1440 x 3168 పిక్సెల్స్​
  • సీపీయూ : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3
  • ర్యామ్​ : 12 జీబీ/ 16 జీబీ
  • స్టోరేజ్ :​ 256 జీబీ/ 512 జీబీ
  • బ్యాటరీ : 5400 mAh
  • రియర్​ కెమెరా : 50 ఎంపీ + 48 ఎంపీ + 64 ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా : 32 ఎంపీ

జియో నుంచి 2 కొత్త​ సర్వీసులు - 'సేఫ్‌ & ట్రాన్స్‌లేట్‌' - ఆ యూజర్లకు మాత్రం ఫ్రీ! - JIO Safe and JIO Translate

గూగుల్ క్రోమ్​లో 5​ నయా ఫీచర్స్​ - ఇకపై సెర్చింగ్​ వెరీ సింపుల్​! - Latest Google Chrome Features

ABOUT THE AUTHOR

...view details