తెలంగాణ

telangana

ETV Bharat / technology

గూగుల్​తో చేతులు కలిపిన వొడాఫోన్- ఈ నిర్ణయంతో స్పామ్ కాల్స్​కు చెక్..!

Vodafone Partnership with Google: టెలికాం దిగ్గజం వొడాఫోన్ తన కస్టమర్లకు Gen AI, సైబర్ సెక్యూరిటీని అందించేందుకు Googleతో చేతులు కలిపింది.

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Vodafone Partnership with Google
Vodafone Partnership with Google (IANS)

Vodafone Partnership with Google: టెలికాం కంపెనీ Vodafone Group Plc ఐరోపా, ఆఫ్రికాలోని తన వినియోగదారులకు క్లౌడ్ సేవలు, Gen AI టూల్స్, సైబర్ సెక్యూరిటీని అందించేందుకు ఆల్ఫాబెట్ Googleతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

గూగుల్​తో వొడాఫోన్ భాగస్వామ్యం:ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని 10 సంవత్సరాల పొడిగిస్తూ వొడాఫోన్.. గూగుల్​ క్లౌడ్ స్టోరేజ్ సబ్​​స్క్రిప్షన్లను ప్రమోట్ చేస్తుంది. ఇందులో Google One AI ప్రీమియం ఉంటుంది. దీని ద్వారా జెమినీ చాట్‌బాట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చని వొడాఫోన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. UK- బేస్డ్ ఆపరేటర్.. స్టోర్స్​లో లేటెస్ట్ Pixel డివైజెస్ ఏఐ ఫీచర్లను ఎలా ఉపయోగించాలో కూడా కస్టమర్లకు చూపిస్తుంది.

"వోడాఫోన్, గూగుల్ కలిసి కొత్త AI-ఆధారిత డివైజెస్​ను మిలియన్ల మంది వినియోగదారుల చేతిలో ఉంచుతాయి. ఈ సేవలను ఉపయోగించడం ద్వారా మా కస్టమర్లు నేర్చుకునేందుకు, కమ్యూనికేట్ చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషించొచ్చు." - మార్గరీటా డెల్లా వల్లే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వోడాఫోన్

గూగుల్ క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించడం:టెలికాం ప్రొవైడర్లు కనెక్టివిటీతో పాటు డిజిటల్ సేవలను అందించడం ద్వారా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా చాలామంది ఆపరేటర్లు విఫలమైనప్పటికీ భారీ లాభాలను ఆర్జించిన బడా టెక్ కంపెనీల విజయాన్ని కాపీ కొట్టాలనుకుంటున్నాయి.

వొడాఫోన్ తన Vodafone TV బాక్స్ సర్వీస్ సెర్చ్, రికమండేషన్స్, యాడ్ లక్ష్యాన్ని మెరుగుపరచుకునేందుకు, బిజినెస్ యూజర్స్ కోసం కొత్త క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్​ను అభివృద్ధి చేసేందుకు గూగుల్ సాంకేతికతను వినియోగిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులకు GenAI, సైబర్ సెక్యూరిటీని అందించేందుకు గూగుల్​తో భాగస్వామ్యం కుదుర్చుకుని వొడాఫోన్ ముందడుగు వేసింది. వొడాఫోన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న స్పామ్ కాల్స్‌, మెసేజ్‌ల సమస్యకు పరిష్కారం లభించనుంది.

"డివైజెస్​పై ఏఐ మరింత ప్రభావవంతంగా ఉండబోతున్నందున డివైజెస్ నేచర్, వ్యక్తుల ఎక్స్​పీరియన్స్ నేచర్ మారబోతున్నాయి. ఇందుకోసం గూగుల్, వొడాఫోన్ కలిసి పనిచేస్తున్నాయి." - థామస్ కురియన్, గూగుల్ క్లౌడ్ సీఈవో

ఓపెన్​ఏఐలో మరో కీలక ఉద్యోగి రాజీనామా- ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలిగిన టిమ్

ఒప్పో దీపావళి సేల్​లో ₹10లక్షలు గెలుచుకొనే ఛాన్స్‌- ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!

ABOUT THE AUTHOR

...view details