ETV Bharat / state

రైతుబంధు నిధులు కొట్టేసిన తహసీల్దార్ - అరెస్ట్ చేసిన పోలీసులు - TEHSILDAR JAYASHREE ARRESTED

రైతుబంధు కుంభకోణంలో తహసీల్దార్ అరెస్ట్ - ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల రైతుబంధు నిధులు స్వాహా

Tehsildar Jayashree Arrested in Rythu Bandhu scam
Tehsildar Jayashree Arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 7:46 PM IST

Tehsildar Jayashree Arrested in Rythu Bandhu scam : సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో రైతుబంధు కుంభకోణం కేసులో పోలీసులు తహసీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ తరలించారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్​గా పనిచేస్తున్న జయశ్రీ గతంలో హుజూర్​నగర్ తహసీల్దార్​గా పని చేశారు. గతంలో ధరణి ఆపరేటర్ జగదీశ్​తో కలిసి రైతుబంధు నిధులు కొట్టేసారు. హుజూర్​నగర్, బూరుగడ్డ రెవెన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు కాజేశారు.

మొత్తం రూ.14,63,004 రైతుబంధు నిధులు తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ కలిసి దారి మళ్లించారు. తహసీల్దార్ జయశ్రీ ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసింది. తహసీల్దార్, పట్టాదారులు రైతుబంధు డబ్బులను సగం సగం పంచుకొని మోసం చేసారు. తహసీల్దార్​పై 420,406,409,120(బీ),468,467 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.