Cricket Ground Staff Salary : క్రికెట్ మ్యాచ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్లేయర్స్, అంపైర్లు, కోచ్‌లు మాత్రమే. అయితే మ్యాచ్ జరగాలంటే స్టేడియం ఉండాలి. మరిదాన్ని మెయింటెన్ చేసేది గ్రౌండ్ స్టాఫ్. వీరి గురించి ఎవరికి తెలియదు, పట్టించుకోరు. అయితే ఈ స్టోరీలో గ్రౌండ్ స్టాఫ్ శాలరీ ఎంత? వారి విధులు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఇదే వారి పని
పిచ్‌ను సిద్ధం చేయడం, ఔట్ ఫీల్డ్స్ మెయింటెనెన్స్, వర్షం పడినా గ్రౌండ్‌లోని నీరు వెళ్లిపోయేటట్లు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి విషయాలను గ్రౌండ్ స్టాఫ్ పర్యవేక్షిస్తారు. అలాగే బౌండరీ రోప్‌లను సరి చేస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్లో గ్రౌండ్ స్టాఫ్‌కు నెలకు రూ.30,000 వరకు శాలరీ ఉంటుందని తెలుస్తోంది. దేశాలను బట్టి ఈ జీతం మారే అవకాశం ఉంది.
ఈ అంశాల ఆధారంగా జీతాలు
అనుభవం
అనుభవం, స్టేడియం ఉన్న ప్రదేశం ఆధారంగా గ్రౌండ్ స్టాఫ్ జీతాలు మారవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అధిక జీతాలు ఉండొచ్చు.
బహుమతుల రూపంలో
భారత్ సహా మరికొన్ని దేశాల్లో గ్రౌండ్ స్టాఫ్ శాలరీకి సంబంధించి ఒక సంప్రదాయం ఉంది. జట్లు లేదా క్రికెట్ బోర్డులు మ్యాచ్‌ల తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌కు నగదును బహుమతిగా ఇస్తాయి. పిచ్ మెయింటెనెన్స్‌ను బాగా చేస్తే ఈ ప్రోత్సాహకాలను అందిస్తాయి.
ఒప్పందాలు
క్రికెట్ బోర్డులు, క్లబ్‌లతో కొంతమంది గ్రౌండ్ స్టాఫ్ ఫుల్‌టైమ్ కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఇందులో ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. దీంతో గ్రౌండ్ స్టాఫ్ శాలరీ మరింత ఎక్కువ లభిస్తుంది.
గ్రౌండ్ స్టాఫ్‌కు ఉన్న సవాళ్లు
స్టేడియం మెయింటెనెన్స్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ గ్రౌండ్ స్టాఫ్‌కు ఆశించినమేర జీతం రావట్లేదని క్రికెట్ వర్గాల మాట. ప్రపంచకప్‌లు లేదా ప్రతిష్ఠాత్మక సిరీస్‌ల్లో మాత్రమే క్రికెట్ బోర్డులు వీరికి బోనస్, నజరానా వంటివి ప్రకటిస్తున్నాయట. అందుకే గ్రౌండ్ స్టాఫ్ జీతాలపై చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌కు ఇంత తక్కువ మొత్తంలో జీతాలేంటని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పిచ్ సరిగ్గా లేకపోతే మ్యాచ్‌లు ఆగిపోయే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మ్యాచ్‌లకు బుమ్రా ఉపయోగించే 'షూ' ధర ఎంతో తెలుసా?
LED స్టంప్‌లు వెరీ కాస్ట్లీ! ధర ఎంతో తెలుసా? - Cricket LED Stumps Cost