IND VS BAN 2nd T20I : అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ 20లో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 రన్స్ సాధించింది. తెలుగు కుర్రాడు ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. మరో ప్లేయర్ రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపులు మెరిపించాడు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచిగానే రాణించాడు. ఓపెనర్లు సంజు శాంసన్ (10), అభిషేక్ శర్మ(10) మొదటి మూడు ఓవర్లలోనే పెవిలినయ్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా నిరాశ పరిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్, రిషాద్ తలో రెండు వికెట్లు తీశారు.
నితీశ్, రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ - అభిషేక్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చాడు నితీశ్ కుమార్. ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. అయితే మహ్మదుల్లా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ నుంచి గేర్లు మార్చాడు నితీశ్. ఈ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదాడు. రిషాద్ వేసిన తర్వాతి ఓవర్‌లో అయితే వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఇదే ఓవర్‌లో రింకూ సింగ్ కూడా ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే 10 ఓవర్లకు జట్టు స్కోరు 100 దాచేసింది.
అనంతరం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నితీశ్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టాడు. కానీ, ముస్తాఫిజుర్ వేసిన తర్వాతి ఓవర్‌లో స్లో బాల్‌కు భారీ షాట్ ఆడి మిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రింకూ సింగ్ మాత్రం దూకుడు కొనసాగించాడు. తంజిమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదేసి 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తస్కిన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో లాస్ట్ బాల్‌కు భారీ షాట్ ఆడి డీప్ మిడ్‌వికెట్‌లో జేకర్ అలీ చేతికి చిక్కాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా వేగంగా వికెట్లు పోగొట్టుకుంది.
పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం వారిదే! - గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే స్టాఫ్ శాలరీ ఎంతో తెలుసా?
పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం వారిదే! - గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే స్టాఫ్ శాలరీ ఎంతో తెలుసా?