ETV Bharat / entertainment

'వార్​ 2' - ఎన్టీఆర్​, హృతిక్​తో పాటు మరో ఇద్దరు హీరోలు? - NTR HRITHIK ROSHAN WAR 2

'వార్​ 2' చిత్రంలో ఎన్టీఆర్​, హృతిక్​తో పాటు నటించనున్న మరో ఇద్దరు బడా హీరోస్​!

NTR Hrithik Roshan
NTR Hrithik Roshan (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 7:55 PM IST

NTR Hrithik Roshan War 2 : ప్రస్తుతం 'దేవర' సక్సెస్​తో ఫుల్​ జోషలో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్​ దర్శకుడు ప్రశాంత్ నీల్​తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన 'దేవర' షూటింగ్ సమయంలో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్​ 'వార్​ 2'కు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చి షూటింగ్​లోనూ పాల్గొన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్​తో కలిసి స్క్రీన్​ను పంచుకోనున్నారు.

తాజాగా ఈ క్రేజీ మల్టీ స్టారర్ 'వార్ 2' గురించి ఓ ఆసక్తికర అప్డేట్​ బయటకు వచ్చింది. సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడించనున్నారట. అదేంటంటే ఈ చిత్రంలో తారక్, హృతిక్​తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారని సమాచారం అందింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమా చివర్లో స్పెషల్ ఎంట్రీ ఇస్తారని ముంబయి సినీ వర్గాల టాక్. హృతిక్, తారక్​తో పాటు సల్మాన్ భాయ్​ పాల్గొనే ఈ ఎపిసోడ్​కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెబుతున్నారు. అలానే శాండల్​వుడ్​ హీరో 'మార్టిన్' ఫేమ్ ధ్రువ సర్జా కూడా 'వార్ 2'లో భాగం కావొచ్చని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

కాగా, 'వార్ 2' షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండానే జరుగుతోంది. ఎందుకంటే ఆయన 'దేవర' ప్రమోషన్స్ కోసం నెల రోజులకుపైనే బ్రేక్ తీసుకున్నారట. అందుకే ఆయన లేని టాకీ పార్ట్, సాంగ్స్​ను పూర్తి చేస్తున్నారట. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్​గా ఇటలీలో జరిగిన కీలక షెడ్యూల్​లో హృతిక్, కియారా అద్వానీపై కొన్ని సీన్స్​తో పాటు ఓ పాటను కూడా షూట్ చేశారు. దసరా అవ్వగానే ఎన్టీఆర్​ 'వార్ 2' సెట్లలో అడుగు పెడతారట. అప్పుడు హృతిక్​, తారక్​పై కీలకమైన క్లైమాక్స్ సీన్స్​తో పాటు ఈ ఇద్దరు హీరోలపై ఓ సాంగ్​ను చిత్రీకరిస్తారని తెలిసింది.

ఈ వార్​ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేస్తారట. ఫిబ్రవరిలోగా సినిమా షూట్ పూర్తి చేసి అనంతరం వీఎఫెక్స్ పనులు చేస్తారని తెలిసింది. 'బ్రహ్మాస్త్ర'లో తన మార్క్​ చూపించిన అయాన్ ముఖర్జీ ఈసారి అంచనాలను మించేలా ఈ చిత్రంతో మెస్మరైజ్ చేస్తారని యూనిట్ టాక్. దీపావళికి ఫస్ట్ లుక్​ను విడుదల చేస్తారట.

SSMB 29 షూటింగ్ ప్రారంభం అప్పుడే - అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌

'వేట్టయన్‌' తెలుగు టైటిల్ పెట్టకపోవడంపై కాంట్రవర్సీ - స్పందించిన నిర్మాణ సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.