ETV Bharat / technology

డిజిటల్ పేమెంట్స్​పై ఆర్బీఐ కీలక నిర్ణయం- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు - RBI INCREASES UPI TRANSACTION LIMIT

RBI Increases UPI Transaction Limit: పండగ సీజన్​లో ప్రజలకు ఆర్బీఐ గుడ్​న్యూస్ తెచ్చింది. యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

RBI Increases UPI Transaction Limit
RBI Increases UPI Transaction Limit (Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 9, 2024, 2:03 PM IST

RBI Increases UPI Transaction Limit: యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంచినట్లు తెలిపారు. దీంతో చిన్న మొత్తంలో లావాదేవీలు చేసే యూజర్స్ ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు.

"యూపీఐ సర్వీసులతో డిజిటల్‌ పేమెంట్స్​ను​ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఈ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలో నగదు డిజిటల్‌ లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచడానికి, ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని ఎంపీసీ సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. మొత్తంగా యూపీఐకి సంబంధించి మూడు ప్రధాన మార్పులు జరగనున్నాయి. అవేంటంటే?

యూపీఐ లావాదేవీల్లో కొత్త మార్పులు ఇవే:

  • యూపీఐ లైట్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,000కి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
  • దీంతోపాటు యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
  • వీటితో పాటు ప్రతి లావాదేవీకి 'యూపీఐ 123పే' లిమిట్‌ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు పెంచారు.

ఏంటీ యూపీఐ లైట్‌..?

  • యూపీఐ లైట్ సౌకర్యాన్ని ఆర్బీఐ ప్రారంభించింది.
  • యూపీఐ నుంచి లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసేందుకు యూపీఐ లైట్​ను సెప్టెంబర్ 2022లో తీసుకొచ్చారు.
  • ప్రతిసారీ పిన్​ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా పేమెంట్​ చేసేందుకు యూపీఐ లైట్‌ సేవలు సహకరిస్తాయి.
  • ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచారు.

యూపీఐ లైట్‌ వ్యాలెట్‌:

  • యూపీఐ లైట్‌ సర్వీసులు పొందాలంటే అందుకోసం యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్‌ ఉండాలి.
  • తాజాగా దీని లిమిట్‌ను రూ.2,000 నుంచి రూ.5,000లకు పెంచారు.

యూపీఐ 123పే:

  • యూపీఐ 123పే అనేది నాన్​-స్మార్ట్​ఫోన్​/ఫీచర్ ఫోన్లు ఉపయోగించే యూజర్స్​కు సంబంధించినది.
  • ఇది స్మార్ట్‌ ఫోన్‌ కాకుండా ఫీచర్‌ ఫోన్ ద్వారా డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.
  • ప్రస్తుతం దీని పరిమితిని రూ. 5,000 నుంచి రూ. 10,000కు పెంచారు.

మీ పీఫ్ అకౌంట్​లో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవాలా?- ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

సొంత AI ప్లాట్​ఫారమ్​ను​ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్​- గూగుల్, శాంసంగ్​కు పోటీగా అదిరే ఫీచర్స్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.