Tecno Phantom V Series:ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఫోల్డబుల్ మొబైల్స్ ఎంట్రీ ఇచ్చాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో తన 'ఫాంటమ్ V' సిరీస్‌ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో 'ఫాంటమ్ V ఫ్లిప్ 2', 'ఫాంటమ్ V ఫోల్డ్ 2' ఫోన్‌లను తీసుకొచ్చింది. కంపెనీ వీటిని బడ్జెట్-ఫ్రెండ్లీగానే తీసుకొచ్చింది. దీంతో ఈ రెండూ దేశంలోనే అత్యంత సరసమైన ఫోల్డబుల్ ఫోన్‌లుగా మారాయి. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ధరలు:
'ఫాంటమ్ V ఫ్లిప్ 2' స్మార్ట్‌ఫోన్ ధర:రూ.34,999
'ఫాంటమ్ V ఫోల్డ్ 2' స్మార్ట్‌ఫోన్ ధర: రూ.79,999
ఈ రెండూ కంపెనీ సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు. వీటిని ఈ నెలలోనే గ్లోబల్‌గా పరిచయం చేశారు. అయితే ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఫోన్‌ల ఈ రేట్లు కేవలం కంపెనీ ప్రారంభ ధరలు మాత్రమే. కొంత కాలం వరకు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత కంపెనీ ఈ ధరలను సవరించనుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ తెలిపింది.
'టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2' స్పెసిఫికేషన్‌లు:
- మెయిన్ డిస్‌ప్లే: 7.85-అంగుళాల AMOLED
- రిజల్యూషన్: 2K
- కవర్ డిస్‌ప్లే:6.42-అంగుళాల FHD+ AMOLED
- ప్రాసెసర్:మీడియాటెక్ డైమెన్షన్ 9000+ చిప్‌సెట్
- బ్యాటరీ: 5,700mAh
కలర్ ఆప్షన్స్:
- కార్స్ట్ గ్రీన్,
- రిప్లింగ్ బ్లూ (designed by LOEWE)
కెమెరా సెటప్: 'V ఫోల్డ్ 2' మొబైల్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్లో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, డ్యూయల్ 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
ఛార్జింగ్:ఈఫోన్ 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అదే సమయంలో 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
'టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 2' స్పెసిఫికేషన్‌లు: