తెలంగాణ

telangana

ETV Bharat / technology

ప్రంపంచంలోనే అతిపెద్ద స్మార్ట్​టీవీ లాంఛ్- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు! - TCL WORLDS LARGEST SMART TV

115 అంగుళాల అతిపెద్ద స్క్రీన్​తో స్మార్ట్​టీవీ- ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

TCL Launches Worlds Largest Smart TV
TCL Launches Worlds Largest Smart TV (Photo Credit- TCL)

By ETV Bharat Tech Team

Published : Jan 16, 2025, 3:27 PM IST

TCL Launches Worlds Largest Smart TV:TCL భారత మార్కెట్లో ప్రపంచంలోనే అతిపెద్ద QD మినీ LED టీవీని లాంఛ్ చేసింది. ఈ టీవీ స్క్రీన్ సైజు 115 అంగుళాలు. కచ్చితమైన కలర్ ప్రొడక్షన్​ను అందించేందుకు ఈ టీవీలో 20 వేలకు పైగా డిమ్మింగ్ జోన్‌లు ఉన్నాయి. అంతేకాక ఇందులో పిక్చర్, ఆడియో అండ్ వీడియో క్వాలిటీని మెరుగుపరిచేందుకు పవర్​ఫుల్ AI ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. ఈ సందర్భంగా ఈ TCL అతిపెద్ద స్మార్ట్​టీవీ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్​టీవీ లాంఛ్:ఈ TCL టీవీ పేరు 'TCL 115-inch QD Mini LED TV'. ఈ టీవీలో గేమ్ మాస్టర్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. దీంతో ఈ టీవీ గేమింగ్​కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక ఇందులో ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) ఉంది. ఇది 10ms కంటే తక్కువ లేటెన్సీని అందిస్తుంది. ఈ టీవీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో ఫీచర్‌తో వస్తుంది. దీని కారణంగా ఈ టీవీలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్ వేరే లెవెల్​లో ఉంటుంది.​

వీటన్నిటితో పాటు ఈ టీవీలో మల్టీ-వ్యూ 2.0 ఫీచర్ కూడా అందించారు. ఇది వినియోగదారులకు ఈ టీవీలో ఒకేసారి రెండు వేర్వేరు కంటెంట్‌లను చూసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ టీవీ హోమ్‌కిట్, ఎయిర్‌ప్లే 2 ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఇతర డివైజ్​కు అయినా కనెక్ట్ చేయొచ్చు. ఈ టీవీపై కంపెనీ 1 సంవత్సరం స్టాండర్డ్ వారంటీని కూడా ఇస్తుంది.

'TCL 115-inch QD Mini LED TV' ఫీచర్లు:

  • స్క్రీన్:115-అంగుళాలు
  • రిజల్యూషన్: 4K
  • రిఫ్రెష్ రేట్:144Hz
  • ఈ టీవీ 98% DCI-P3 అల్ట్రా హై కలర్ గాముట్​కు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు ఈ టీవీ HDR5000 నిట్స్, HDR10+, TUV బ్లూ లైట్, TUV ఫ్లికర్ ఫ్రీ సపోర్ట్‌తో వస్తుంది.
  • ఈ టీవీ స్క్రీన్‌లో 20,000 కంటే ఎక్కువ డిమ్మింగ్ జోన్‌లను ఉపయోగించారు. దీంతో దీని స్క్రీన్​లో కలర్స్​ పూర్తిగా సహజంగా, వాస్తవికంగా కన్పిస్తాయి. దీనితో పాటు వినియోగదారులు ఈ టీవీలో అద్భుతమైన క్వాలటీతో పిక్చర్​లను చూసే అనుభవాన్ని కూడా పొందుతారని కంపెనీ పేర్కొంది.
  • ఈ టీవీలోని QD మినీ LED ప్యానెల్ అనేది TCL అత్యుత్తమ డిస్​ప్లే. దీని కారణంగా ఇది TCL అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన టీవీగా మారింది.
  • ఈ టీవీ TCL T-స్క్రీన్ అల్ట్రా టెక్నాలజీతో వస్తుంది. ఇది వినియోగదారులకు హైయెస్ట్ కాంట్రాస్ట్ లెవెల్స్​ను అందిస్తుంది.
  • ఈ టీవీలో AiPQ ప్రో ప్రాసెసర్​ను ఉపయోగించారు. దీన్ని TCL AI-పవర్డెడ్ ప్రాసెసర్‌తో అమర్చారు. ఈ AI ప్రాసెసర్ కారణంగా ఈ టీవీ పిక్చర్ అండ్ ఆడియో క్వాలిటీలో చాలా మెరుగ్గా ఉంటుంది.
  • వీటన్నింటితో పాటు ఈ టీవీలో సినిమా-గ్రేడ్ సౌండ్ కోసం ONKYO 6.2.2 Hi-Fi ఆడియో సిస్టమ్ అమర్చారు.

ధర:భారత మార్కెట్​లో ఈ టీవీ ధర రూ. 29,99,990 (29 లక్షల 99 వేల తొమ్మిది వందల తొంభై). ఈ టీవీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర రిటైల్ భాగస్వాములలో సేల్​కు అందుబాటులో ఉండనుంది.

ఆఫర్లు ఇవే!:ఇన్ని హై-ఎండ్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్​టీవీపై కంపెనీ లాంఛ్ ఆఫర్​ను కూడా తీసుకొచ్చింది. ప్రారంభంలో పరిమిత కాలం పాటు ఈ టీవీని కొనుగోలు చేసే వినియోగదారులకు 75-అంగుళాల QLED టీవీని పూర్తిగా ఉచితంగా అందించనుంది.

చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం

వాట్సాప్​లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు- సెల్ఫీలను స్టిక్కర్లుగా.. ఇకపై చాట్​లో అన్​లిమిటెడ్ ఫన్!

ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ రేసులోకి నథింగ్!- కిర్రాక్ ఏఐ ఫీచర్లతో 'నథింగ్ ఫోన్ 3' దింపేందుకు రెడీ?

ABOUT THE AUTHOR

...view details