Realme 14 Pro Series Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి తన 'రియల్‌మీ 14 ప్రో' సిరీస్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్‌మీ 14 ప్రో', 'రియల్‌మీ 14 ప్రో ప్లస్' అనే రెండు మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా ఉంది. అంతేకాక ఈ సెగ్మెంట్ ఫోన్‌లో మాత్రమే క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. వీటితో పాటు వినూత్న రీతిలో ఉష్ణోగ్రతను బట్టి కలర్స్ మార్చే టెక్నాలజీతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల సేల్స్ జనవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
స్పెసిఫికేషన్లు: 'రియల్‌మీ 14 ప్రో' సిరీస్ 42 డిగ్రీల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, అల్ట్రా-స్లిమ్ 1.6mm ఎడ్జ్-టు-ఎడ్జ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, వినూత్న కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు ఈ సిరీస్ మొబైల్స్‌లో హీట్ ఎక్కువైతే కంట్రోల్ చేసేందుకు థర్మోక్రోమిక్ పిగ్మెంట్స్ ఉన్నాయి. అంతేకాక ఇది టెంపరేచర్ పెరిగితే సిగ్నల్ కూడా అందిస్తుంది. ఉష్ణోగ్రత 16°C కంటే తక్కువ ఉంటే ఇది పెర్ల్ వైట్ నుంచి వైబ్రెంట్ బ్లూ కలర్లోకి మారుతుంది. టెంపరేచర్ పెరిగేకొద్దీ ఇది రివర్స్ అవుతుంది. ఇందులో తెలుపు రంగులో తీసుకొచ్చిన వేరియంట్‌లో ఈ కోల్డ్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ ఫీచర్ జోడించారు.
1. 'రియల్‌మీ 14 ప్రో' మోడల్ ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.77 అంగుళాల అమోలెడ్ స్క్రీన్
- రిఫ్రెష్ రేటు: 120Hz
- పీక్ బ్రైట్‌నెస్: 4,500 నిట్స్
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300
- బ్యాటరీ: 6,000mAh
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్
- కెమెరా సెటప్: ఈ స్మార్ట్‌ఫోన్ వెనకవైపు 50MP Sony IMX882 OIS తో మెయిన్ కెమెరా సెన్సార్ ఉంది. ఇది కాకుండా ఫోన్‌లో మోనోక్రోమ్ కెమెరాను కూడా కలిగి ఉంది. దీని వెనక కెమెరా నుంచి 30fps వద్ద 4K వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు. ఇక ఇందులో సెల్ఫీ కోసం ముందువైపు 16MP కెమెరా ఉంది.
- కనెక్టివిటీ ఫీచర్లు: ఈ ఫోన్‌లో 5G + 5G డ్యూయల్ మోడ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, టైప్-C పోర్ట్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ అండర్ స్క్రీన్ సెన్సార్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0 OS పై నడుస్తుంది.
ఇతర ఫీచర్లు: ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IP66+IP68+IP69 రేటింగ్, మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్:
- పింక్
- వైట్
- గ్రే
వేరియంట్స్: ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- 8GB +128 GB
- 8GB+ 256 GB
ధర:
- 8GB +128GB వేరియంట్ ధర: రూ.24,999
- 8GB+ 256GB వేరియంట్ ధర: రూ.26,999
2. 'రియల్‌మీ 14 ప్రో ప్లస్' మోడల్ ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.83 అంగుళాల అమోలెడ్ స్క్రీన్
- రిఫ్రెష్ రేటు: 120Hz
- పీక్ బ్రైట్‌నెస్: 4,500 నిట్స్
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3
- బ్యాటరీ: 6,000mAh
- 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- కెమెరా సెటప్: ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ IMX896 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8MP సోనీ అల్ట్రా- వైడ్ షూటర్, 50MP సోనీ IMX882 సెన్సర్ ఉంది. ఇక దీని ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను అందించారు.
- కనెక్టివిటీ ఫీచర్లు: ఈ ఫోన్‌లో 5G + 5G డ్యూయల్ మోడ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, టైప్-C పోర్ట్, GPS ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ అండర్ స్క్రీన్ సెన్సార్ వంటి అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0 OS పై నడుస్తుంది.
- ఇతర ఫీచర్లు: ఈ మోడల్ ఫోన్‌లో కూడా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IP66+IP68+IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్:
- బిక్‌నెర్ పర్పల్
- వైట్
- గ్రే
వేరియంట్స్:
- 8GB + 128 GB
- 8GB +256 GB
- 12GB + 256GB
ధర:
- 8GB + 128 GB వేరియంట్ ధర: రూ.29,999
- 8GB +256 GB వేరియంట్ ధర: రూ.31,999
- 12GB + 256GB వేరియంట్ ధర: రూ.34,999
సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా- క్రాష్ టెస్ట్‌లో మహింద్రా మరో 2 కార్లకు 5-స్టార్ రేటింగ్
ప్రంపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌టీవీ లాంఛ్- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!
చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం