Tata Curvv EV Variants:ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటం వల్ల చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఈ పండక్కి కొత్త ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ కారుపై ఓ లుక్కేయండి. ఈ కారును స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసింది.
కంపెనీ ఈ కారును రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య బడ్జెట్ ధరలోనే రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారును మొత్తం ఐదు ట్రిమ్ లెవెల్స్‌లో తీసుకొచ్చింది. ఇందులో క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ ఎ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
పవర్‌ట్రెయిన్, బ్యాటరీ అండ్ రేంజ్: టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S వేరియంట్స్ 45kWh యూనిట్‌తో అందుబాటులో ఉన్నాయి. వీటి MIDC-సర్టిఫైడ్ రేంజ్ 502 కిలోమీటర్లు. అంతేకాక అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ A వేరియంట్లు 55kWh బిగ్ బ్యాటరీతో వస్తున్నాయి. దీని MIDC రేంజ్ 585 కిలోమీటర్లు. వీటితో పాటు బిగ్ బ్యాటరీతో వస్తున్న వేరియంట్లో 165bhp శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. అయితే 45kWh ఒక్కటే 148bhp శక్తిని అందించే మోటార్‌ను కలిగి ఉంది.
Tata Curvv EV క్రియేటివ్ ఇతర ఫీచర్లు:
బ్యాటరీ: 45kWh
- LED హెడ్‌ల్యాంప్‌లు
- ఫ్లష్ డోర్ హ్యాండిల్
- 17-అంగుళాల స్టీల్ వీల్స్
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- ESP
- డ్రైవర్ డోస్ ఆఫ్ వార్నింగ్
- అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు
- ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
- రియర్ కెమెరా
- 7-అంగుళాల టచ్‌స్క్రీన్
- 7-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay
- ఆరు స్పీకర్లు
- పాడిల్ షిఫ్టర్స్ (రీజెన్)
- డ్రైవ్ మోడ్స్
- రియర్ AC వెంట్స్
- ఎలక్ట్రికల్ అడ్జిస్టబుల్ వింగ్ మిర్రర్
- ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ టెయిల్‌గేట్
- పవర్- అడ్జస్టిబుల్ డ్రైవర్ సీట్
- వెహికల్-టు- వెహికల్ ఛార్జింగ్ (V2V)
- వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ (V2L)
- TPMS
- iRA కనెక్ట్-టెక్
- ధర:రూ. 17.49 లక్షలు
Tata Curvv EV అకాంప్లిష్డ్ ఇతర ఫీచర్లు:
- బ్యాటరీ: 45kWh లేదా 55kWh
- ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్
- కనెక్టెడ్ టెయిల్-ల్యాంప్స్
- ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
- 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
- ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్
- 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
- నావిగేషన్‌తో 10.25-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే
- ఎనిమిది స్పీకర్లు
- ముందు, వెనక 45W ఛార్జర్
- లెథర్ అప్హోల్స్టరీ
- లెథర్ స్టీరింగ్ వీల్
- ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్
- అలెక్సా వాయిస్ అసిస్టెంట్
- ధర: రూ. 18.49 లక్షల నుంచి రూ. 19.25 లక్షలు