Vivo X200 Series: త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'వివో X200' సిరీస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. అడ్వాన్స్డ్ కెమెరా, పవర్ఫుల్ బ్యాటరీతో వీటిని లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అయింది. ఈ మేరకు 'వివో X200' సిరీస్ మొబైల్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు వివో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా పంచుకుంది.
ఇండియాలోకి 'వివో X200' సిరీస్ ఎంట్రీ: త్వరలో భారత మార్కెట్లోకి 'వివో X200' సిరీస్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు వివో సన్నాహాలు చేస్తోంది. మలేషియాలో వీటిని గ్లోబల్‌గా లాంచ్ చేసిన తర్వాత 'వివో X200' సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఈ సిరిస్‌లో 'వివో X200', 'వివో X200 ప్రో' మొబైల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు MediaTek Dimensity 9400 ప్రాసెసర్‌తో రావొచ్చు. 'వివో X200' మొబైల్ 5,800mAh బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. ఇది 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండొచ్చు. ఇక 'X200 ప్రో' 6.78-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
కెమెరా: ఈ రెండు స్మార్ట్ఫోన్లు 32MP ఫ్రంట్ కెమెరాతో రావొచ్చు. వీటి బ్యాక్ కెమెరా సెటప్ ట్రిపుల్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 'వివో X200' మొబైల్ వెనక ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉండొచ్చు.
3 స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయనున్న వివో: కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో 'వివో X200' సిరీస్‌లో మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేయనుంది. అయితే మలేషియాలో మాత్రం కేవలం రెండు వేరియంట్‌లను మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అవి 'వివో X200', 'వివో X200 ప్రో' మోడల్ మొబైల్స్.
అయితే కంపెనీ ఈ సిరీస్‌లోని మూడు మోడళ్లను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ 'వివో X200' సిరీస్ మొబైల్స్‌ను కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచ్ చేసింది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో మూడు మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. డిసెంబరు చివరి నాటికి ఈ సిరీస్‌ను భారత్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇది పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
What you thought was far... just got closer.
— vivo India (@Vivo_India) November 22, 2024
See the world not as it is, but as it could be.
Coming soon.#vivoX200Series pic.twitter.com/4BDe6qbWml
కలర్ ఆప్షన్స్:
- 'వివో X200', 'వివో X200 ప్రో' మొబైల్స్ రెండూ టైటానియం, సఫైర్ బ్లూ, నైట్ బ్లాక్, వైట్ మూన్‌లైట్ వంటి కలర్ ఆప్షన్స్‌లో రానున్నాయి.
- అదే సమయంలో కొత్త మినీ వేరియంట్ వేరియంట్ టైటానియం బ్లూ, మైక్రో పౌడర్ (పింక్), ఆబ్స్ట్రాక్ట్ ఫార్వర్డ్ (వైట్) కలర్స్‌లో వచ్చే అవకాశం ఉంది.
అమెజాన్ నుంచి పవర్ఫుల్ స్మార్ట్ డిస్ప్లే- దీని ఉపయోగాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
వారెవ్వా.. BMW కొత్త కారు ఏం ఉంది భయ్యా.. ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం!