Mitchell Starc On Jasprit Bumrah : టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టులో రఫ్పాడిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఆ నేపథ్యంలో బుమ్రాపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌ని ప్రశంసించాడు. మూడు ఫార్మాట్‌లలో స్థిరంగా రాణించడానికి తన బౌలింగ్ యాక్షనే ముఖ్య కారణమని తొలి రోజు ఆట ముగిసిన తర్వాత స్టార్క్ పేర్కొన్నాడు.
'బుమ్రా యూనిక్ యాక్షన్, ముఖ్యంగా మోచేయిలో ఉన్న హైపర్ ఎక్స్‌టెన్షన్ అతడి బౌలింగ్‌ని ప్రభావవంతంగా చేస్తుంది. బుమ్రా బంతిని రిలీజ్ చేసే పాయింట్‌ని ఇతర బౌలర్లు అనుకరించలేరు. అందుకే మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలంపాటు బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతాడని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అతడి సత్తా ఏంటో ఇవాళ మరోసారి చూశాం. ఇతర బౌలర్లకు సాధ్యం కానిదేదో బుమ్రా వద్ద ఉంది. నేను కూడా అతడి స్టైల్‌ని ఎప్పుడూ ప్రయత్నించను. అలా చేస్తే గాయపడే ప్రమాదం ఉంది' అని చెప్పాడు.
enjoy jasprit bumrah's opening spell ball by ball pic.twitter.com/allWdclh9s
— rishi (@rishi__w) November 22, 2024
భార్య పోస్ట్ వైరల్
కాగా, బుమ్రా సూపర్ సక్సెస్‌ను అతడి భార్య సంజనా గణేశన్ కూడా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో భర్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో సరదాగా స్పందించింది. బుమ్రా మ్యాచ్- టర్నింగ్ స్పెల్‌ను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చీకీ పోస్ట్ షేర్ చేసింది. క్యాప్షన్‌లో 'గ్రేట్ బౌలర్, ఈవెన్ గ్రేటర్ బూటీ (Great bowler, even greater booty)' అని రాసింది. బుమ్రా పెర్ఫార్మెన్స్ ఇలా ప్రశంసించడం అభిమానులను ఆకర్షించింది.
Sanjana Ganesan's Instagram story. 🤣🍑 pic.twitter.com/6ml2prUrh5
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024
రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన బుమ్రా భారత బౌలింగ్ అటాక్‌ని అద్భుతంగా నడిపించాడు. కేవలం 10 ఓవర్లలో 4/17తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఉస్మాన్ ఖవాజా (8), మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్ (0), కమ్మిన్స్ (3) వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67-7తో పోరాడుతోంది. అంతకుముందు టీమ్ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.
PEAK COMMENTARY FOR PEAK BOWLING. 🔥
— Johns. (@CricCrazyJohns) November 22, 2024
- The world cricket is celebrating Bumrah. pic.twitter.com/SCIE2JYfWo
2024లో తిరుగులేదు
2024లో బుమ్రా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్. 10 మ్యాచ్‌లలో 15.37 యావరేజ్, 3.06 ఎకానమీతో 45 వికెట్లు పడగొట్టాడు.
డే 1 కంప్లీట్- ఒక్కరోజే 17వికెట్లు- తొలి రోజు హీరో బుమ్రానే!