ETV Bharat / technology

లగ్జరీ కారు కొనడం మీ కలా..? అయితే వెంటనే త్వరపడండి.. త్వరలో వాటి ధరలు పెంపు! - BMW PRICE HIKE

'తగ్గేదేలే' అంటున్న లగ్జరీ కార్లు!- బెంజ్ బాటలోనే BMW

BMW
BMW (BMW)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 22, 2024, 7:49 PM IST

BMW Price Hike: దేశీయ లగ్జరీ కార్ల బ్రాండ్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వచ్చే ఏడాదిలో తమ కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇదే బాటలో BMW కంపెనీ కూడా తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.

జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్‌పుట్ వ్యయం, కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BMW పేర్కొంది. కస్టమర్లకు అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్పత్తులను అందించడంలో మాత్రం రాజీ పడబోమని కంపెనీ స్పష్టం చేసింది. దేశీయంగా BMW కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

BMW ప్రస్తుతం స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపేతో పాటు 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ వీల్‌బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ కార్లను తయారు చేస్తోంది. ఇవి కాకుండా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం2 కూపే మోడళ్లను పూర్తిగా తయారైన తర్వాత కంపెనీ దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి వీటి ధరలు 3 శాతం మేర పెరగనున్నాయి. అయితే వీటిలో ఏ మోడల్ ధర ఎంత పెరగనుందో కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా బెంజ్ కార్ల కొత్త ధరలు కూడా 2025 జనవరి1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మెర్సిడెస్ తెలిపింది. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులను కారణంగా చూపింది. మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ-క్లాస్‌ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 SUV వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో బెంజ్ కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు బెంజ్‌ కార్ల ధరలు పెరగనున్నాయి. అయితే ఆ కస్టమర్లకు మాత్రం ఈ ధరలు వర్తించవని కంపెనీ స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు ఎవరికో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

వివో టైమ్ ఆగయా- అడ్వాన్స్​డ్ కెమెరా, పవర్​ఫుల్ బ్యాటరీతో 'X200' సిరీస్!

అమెజాన్​ నుంచి పవర్​ఫుల్ స్మార్ట్​ డిస్​ప్లే- దీని ఉపయోగాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.