Samsung Offers Free Screen Replacement :దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ తమ గెలాక్సీ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న ఫోన్లకు పూర్తి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది వన్-టైమ్ ఆఫర్ మాత్రమే అని స్పష్టం చేసింది.
వీటికి మాత్రమే!
వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్షిప్ ఫోన్లలో చాలా సార్లు గ్రీన్ లైన్ ఇష్యూ కనిపించింది. ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫోన్లలోనూ ఇదే సమస్య రిపీట్ అయ్యింది. దీనితో యూజర్ల నుంచి శాంసంగ్ కంపెనీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో పూర్తి ఉచితంగా డిస్ప్లే రీప్లేస్మెంట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫ్రీ ఆఫర్ అన్ని శాంసంగ్ ఫోన్లకు వర్తించదని స్పష్టం చేసింది.
గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్21, గెల్సాకీ నోట్ 20, గెలాక్సీ 22 ఫ్లాగ్షిప్ ఫోన్లకు మాత్రమే ఉచితంగా డిస్ప్లే రీప్లేస్మెంట్ చేస్తారు. అది కూడా గత మూడేళ్లలోపు గెలాక్సీ ఫోన్లు కొన్నవారికి మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్ అందిస్తారు.
వారెంటీ అవసరం లేదు!
శాంసంగ్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందడానికి వారెంటీ అవసరం లేదు. అంటే ఫోన్ వారెంటీ డేట్ పూర్తయిన వాళ్లు కూడా పూర్తి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు.