Samsung Tri-Fold Smartphone:టెక్ మార్కెట్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు కొత్త రకం ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్త మోడల్ మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్‌దే హవా. వీటికి ఉన్న క్రేజ్ వేరే లెవల్. దీంతో ఫోల్డబుల్ మొబైల్స్ తీసుకొచ్చేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి.
ఇప్పటికే మార్కెట్లో పలు కంపెనీల నుంచి ఫోల్డబుల్ మొబైల్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా శాంసంగ్ కూడా తన ఫోల్డ్ మొబైల్స్‌ను పరిచయం చేసేందుకు తహతహలాడుతోంది. ఈ మేరకు శాంసంగ్ ట్రై- ఫోల్డ్ మొబైల్ తీసుకొచ్చే పనిలో పడిందని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై తాజాగా ZDNet కొరియా రిపోర్ట్ (కొరియన్లో).. ఒక క్లారిటీ ఇచ్చింది.
ఈ నివేదిక.. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎంట్రీ లెవల్ క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ట్రై-ఫోల్డ్ మోడల్‌ను తీసుకొచ్చే పనిలో పడిందని వెల్లడించింది. ఈ రెండు ఫోల్డబుల్ మొబైల్స్‌ను శాంసంగ్ వచ్చే ఏడాది లాంచ్ చేయొచ్చని తెలిపింది. శాంసంగ్ మాత్రమే కాకుండా Xiaomi, Honor, Oppo వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా తమ ట్రై-ఫోల్డ్మొబైల్స్ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నాయని సమాచారం. అయితే ఇవి వాటి ట్రై- ఫోల్డ్ మొబైల్స్‌ను మరింత పెద్ద స్క్రీన్‌తో తీసుకురావచ్చని తెలుస్తోంది.