Samsung Galaxy S25 Series Update:మరికొద్ది రోజుల్లో శాంసంగ్ 'గెలాక్సీ S25' సిరీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సిరీస్‌లో 'శాంసంగ్ గెలాక్సీ S25', 'శాంసంగ్ గెలాక్సీ S25+', 'శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా' మోడల్‌లు ఉన్నాయి. ఈసారి 'గెలాక్సీ S25' సిరీస్ బిగ్ ర్యామ్‌తో తీసుకొస్తున్నామని శాంసంగ్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న S24 సిరీస్‌తో పోలిస్తే ఇది పెద్ద మార్పు. కంపెనీ ఈ సిరీస్‌ను జనవరి 22న లాంఛ్ చేసే అవకాశం ఉంది.
Samsung Galaxy S25: 'గెలాక్సీ S25' సిరీస్ స్టాండర్డ్‌గా 12GB RAMతో వస్తుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లోని ఏ మోడల్లోనూ ప్రస్తుతం ఉన్న 'S24' సిరీస్ మాదిరిగా 8GB RAM ఉండదు. కంపెనీ ప్రస్తుతం 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో 'S24'లో 8GB RAMని ప్యాక్ చేస్తోంది. అయితే 'S24 ప్లస్', 'S24 అల్ట్రా' మోడల్స్ 12GB RAMతో వస్తాయి.
ఇక 'S25' బేస్ వేరియంట్ 12GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. 'S25 అల్ట్రా' 16GB RAMని కలిగి ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. పెరిగిన ర్యామ్‌తో పాటు, అదిరే AI ఫీచర్లు ఈ సిరీస్ మొబైల్స్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ప్రైస్ అండ్ ఫీచర్స్:క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో ఈ అప్‌కమింగ్ సిరీస్ వస్తున్నాయి. 5G కనెక్టివిటీ ఉన్న ఈ మూడు మోడల్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతాయి. 'S24' సిరీస్‌తో పోలిస్తే 'S25' సిరీస్‌లో మెరుగైన కెమెరా ఉంది. ప్రస్తుత 12MPకి బదులుగా 'గెలాక్సీ S25 అల్ట్రా' 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.