Samsung Galaxy S25 Series Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్ త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ మొబైల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు USలో 'Galaxy Unpacked' ఈవెంట్లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే వీటి రిలీజ్‌పై శాంసంగ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ది ఫైనాన్షియల్ న్యూస్ (కొరియన్) నివేదిక ప్రకారం.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్25' సిరీస్ ఫోన్లు జనవరి 23, 2025న రిలీజ్ కానున్నాయి. అప్‌కమింగ్ లైన్అప్లో రెగ్యులర్ 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25+', 'గెలాక్సీ S25 అల్ట్రా' మోడల్స్‌తో పాటు చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న 'గెలాక్సీ ఎస్ 25 స్లిమ్' మోడల్‌ను కూడా ఈ ఈవెంట్లో పరిచయం చేయొచ్చు.
అదనంగా టిప్‌స్టర్ మాక్స్‌జాంబోర్ స్కెప్టిక్ X పోస్ట్‌లో ఈ లాంచ్ టైమ్‌లైన్‌ను ధృవీకరించారు. వచ్చే ఏడాది జనవరి 22న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. జోన్ డిఫరెన్సెస్ కారణంగా ఒకరోజు వ్యత్యాసం ఉండొచ్చు. దాని Q3 ఎర్నింగ్ కాల్ సమయంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 'గెలాక్సీ S25' సిరీస్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. అయితే కంపెనీ కచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు.