India Smartphone Market 2024:ప్రస్తుతం స్మార్ట్ఫోన్లదే హవా. మొబైల్ అందుబాటులో లేకుంటే పూట గడవని పరిస్థితిలో వీటి సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. దీంతో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దూసుకుపోతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ నివేదిక తెలిపింది. రూరల్ డిమాండ్, మాన్సూన్ సేల్స్ ప్రారంభంతో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జూలై- సెప్టెంబర్ కాలంలో 9శాతం వృద్ధి చెందినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ మేరకు దేశీయంగా 47.1 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్లను షిప్పింగ్ చేసినట్లు పేర్కొంది.
"మార్కెట్‌లోని టాప్ బ్రాండ్‌లు తమ పోర్ట్‌ఫోలియోను మిడ్-హై రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. పండుగ సేల్స్ సమయంలో ఇన్వెంటరీని క్లియర్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో టాప్-5 అవుట్ సైడ్ బ్రాండ్స్ మరో స్ట్రాంగ్ క్వార్టర్లో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 15తో గణనీయమైన వాల్యూమ్స్‌ను పెంచింది. వీటికి చిన్న సిటీల నుంచి భారీ డిమాండ్ వస్తోంది." - సన్యామ్ చౌరాసియా, సీనియర్ విశ్లేషకుడు
మోటరోలా, గూగుల్, నథింగ్ వంటి ఇతర బ్రాండ్స్ ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్, ఛానెల్ విస్తరణ స్ట్రాటజీలతో వాటి సేల్స్ పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వీవో 19శాతం మార్కెట్ షేర్, 9.1 మిలియన్ యూనిట్లను షిప్పింగ్‌తో దూసుకుపోతూ మొదటిసారి పోల్ పొజిషన్‌ను క్లెయిమ్ చేసింది. ఇక Xiaomi రెండో స్థానంలో నిలిచింది. ఇది దాని బడ్జెట్ 5G లైనప్‌తో 7.8 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. 7.5 మిలియన్ యూనిట్లతో శాంసంగ్మూడో స్థానంలో నిలిచింది. OPPO (OnePlus మినహా) 6.3 మిలియన్ షిప్పింగ్‌తో నాలుగో స్థానంలో నిలవగా realme 5.3 మిలియన్ యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.