తెలంగాణ

telangana

ETV Bharat / technology

గ్లోబల్​గా రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్స్​కు రీకాల్- కారణం ఏంటంటే? - Royal Enfield Recall

Royal Enfield Recall: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్‌ సైకిళ్లకు రీకాల్ చేపట్టింది. ఇండియా సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో విక్రయించిన వాహనాలను తిరిగి వెనక్కి రప్పిస్తోంది. ఈ రీకాల్​కు కారణం ఏంటంటే?

Royal Enfield
Royal Enfield (Royal Enfield)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 5:25 PM IST

Royal Enfield Recall:ప్రముఖ మోటార్‌ సైకిల్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిళ్ల రీకాల్ చేపట్టింది. ఇండియా సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో విక్రయించిన వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. 2022 నవంబర్‌ నుంచి 2023 మార్చి మధ్య తయారైన వాహనాలను రీకాల్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

రీప్లేస్మెంట్ ప్రక్రియకు కారణం ఇదే:

  • రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిల్‌ వెనక భాగంలో ఉండే రిఫ్లెక్టర్‌లో లోపమే ఈ రీకాల్‌ చేపడుతున్నామని పేర్కొంది.
  • ఈ నేపథ్యంలో చిన్నపాటి పార్టునురీప్లేస్‌చేసేందుకు వాహనాలను వెనక్కి రప్పిస్తుంది.
  • ఆయా రిఫ్లెక్టర్లు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే రీకాల్ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది.
  • అయితే ఎన్ని వాహనాలు రీకాల్ చేపడుతున్నదీ మాత్రం రాయల్ ఎన్​ఫీల్డ్ వెల్లడించలేదు.

దశలవారీగా రీకాల్ ప్రాసెస్:

  • రీకాల్‌ ప్రక్రియను కంపెనీ దశలవారీగా చేపట్టనున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెలిపింది.
  • మొదట ఈ రీకాల్‌ను దక్షిణ కొరియా, అమెరికా, కెనడాలో చేపట్టనున్నారు.
  • తర్వాత భారత్‌, బ్రెజిల్, లాటిన్‌ అమెరికా, యూరప్‌, యూకేలో ఈ ప్రక్రియ జరగనుంది.
  • కంపెనీ ప్రతినిధులే వినియోగదారులకు రీకాల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారని, కేవలం 15 నిమిషాల్లోనే రిఫ్లెక్టర్ల మార్పిడి చేసి ఇస్తామని, ఈ ప్రక్రియ పూర్తి ఉచితంగానే చేపట్టనున్నట్లు తెలిపింది.
  • తక్కువ సైజులో శాంపిళ్ల పరిశీలనలో రిఫ్లెక్టర్లలో లోపం గుర్తించామని, దీనివల్ల బైక్‌ పనితీరుపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేసింది.

స్టన్నింగ్ టైగర్ లుక్స్​తో కొత్త రేంజ్ రోవర్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Range Rover SV New Edition

అరుదైన ఘనత సాధించిన హ్యుందాయ్- 10 కోట్ల యూనిట్ల కార్ల తయారీతో రికార్డ్! - Hyundai Motor Hits Major Milestone

ABOUT THE AUTHOR

...view details