WhatsApp Stop Working: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో అలెర్ట్. మరికొన్ని రోజుల్లో కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు. ఈ మేరకు ఆయా మొబైల్స్‌లో తమ సేవలను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇకపై ఏ ఏ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు? వంటి వివరాలు మీకోసం.
కారణం ఇదే!: సాధారణంగా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందించడంతో పాటు యూజర్ భద్రత విషయంలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్‌లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయని పాత ఫోన్లలో తన సేవలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు ఇక అందుబాటులో ఉండవు. ఇప్పటికీ యూజర్లు వాటిని వాడుతుంటే మాత్రం కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
ఏ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదంటే?: ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. ఇది దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్. దీనికి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం వాట్సాప్ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వేళ పాత ఫోన్లలో వాట్సాప్ వాడటం అంత సేఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే ఈ పాత ఓఎస్‌తో పనిచేస్తున్న మొబైల్స్‌లో జనవరి 1 నుంచి తన సేవలను నిలిపి వేయాలని వాట్సాప్ నిర్ణయించింది.
ఐఫోన్లలో కూడా..!: ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పాటు ఆయా ఐఫోన్లకూ వాట్సాప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లలో తన సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ పాత 'ఐఫోన్ 5s', 'ఐఫోన్ 6', 'ఐఫోన్ 6 ప్లస్' ఫోన్లను వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐఫోన్ యూజర్లకు కంపెనీ వచ్చే ఏడాది మే 5వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
వాట్సప్ సర్వీసులు నిలిచిపోనున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే..!:
- Samsung Galaxy S3
- Motorola Moto G
- HTC One X
- Sony Xperia Z.
- Samsung Galaxy S3
- Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini
- Motorola Moto G (1st generation)
- Motorola Razr HD
- Moto E 2014
- HTC One X
- HTC One X+
- HTCDesire 500
- HTCDesire 601
- LG Optimus G
- LG Nexus 4
- LG G2 Mini
- LG L90
- Sony Xperia Z
- Sony Xperia SP
- Sony Xperia T
- Sony Xperia V
దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ ఫోన్లు ఇప్పటికీ వాడుతుండడం చాలా అరుదు. ఒకవేళ ఎవరైనా వీటిని వాడుతుంటే మాత్రం వాట్సాప్ సేవల కోసం కొత్త ఏడాదిలో కొత్త ఫోన్‌కు మారాల్సిందే!
స్మార్ట్‌ఫీచర్లతో కొత్త హోండా యాక్టివా- దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే కొనకుండా ఉండలేరుగా..!
అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. డివైజ్‌ల వాడకంపై పరిమితి!