ETV Bharat / business

2025 జనవరి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - BANK HOLIDAYS IN JANUARY 2025

2025 జనవరిలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవు - ఈ హాలీ డేస్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎలా చేయాలంటే?

Bank holidays
Bank holidays (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

Bank Holidays In January 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2025 జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In January 2025
2025 జనవరి నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

జనవరి 1 (బుధవారం) : న్యూ ఇయర్‌ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.

జనవరి 2 (గురువారం) : కొత్త సంవత్సరం సందర్భంగా మిజోరంలో; మన్నం జయంతి సందర్భంగా కేరళలోని బ్యాంకులకు సెలవు.

జనవరి 6 (సోమవారం) : గురు గోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా హరియాణా, పంజాబ్‌ల్లోని బ్యాంక్‌లకు సెలవు.

జనవరి 11 (శనివారం) : మిషనరీ డే సందర్భంగా మిజోరంలో; గురు గోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు.

జనవరి 12 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులు సెలవు. అయితే ఆ రోజు స్వామీ వివేకనంద జయంతి, గాన్-నగై (మణిపుర్‌) కూడా ఉన్నాయి.

జనవరి 14 (మంగళవారం) : మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు; పొంగల్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

జనవరి 15 (బుధవారం) : మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో; మాఘ్‌ బిహు సందర్భంగా అసోంలో, తిరువళ్లువార్ డే సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు.

జనవరి 16 (గురువారం) : కనుమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో; ఉజ్ఙవర్‌ తిరునాళ్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు.

జనవరి 22 (బుధవారం) : ఇమోఇను ఇరత్ప సందర్భంగా మణిపుర్‌లోని బ్యాంకులకు సెలవు.

జనవరి 23 (గురువారం) : గాన్‌-నగై సందర్భంగా మణిపుర్‌లో; నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్‌, సిక్కిం, బంగాల్‌, జమ్ముకశ్మీర్‌, దిల్లీల్లోని బ్యాంకులకు సెలవు.

జనవరి 25 (శనివారం) : స్టేట్ డే సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు.

జనవరి 26 (ఆదివారం) : రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు.

జనవరి 30 (గురువారం) : సోనమ్‌ లోసార్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : 2025 జనవరి​​ ​నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.