Royal Enfield Bear 650:రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకూ తన బేర్ 650 బైక్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చింది. దీన్ని EICMA 2024లో రిలీజ్ చేయనున్నారు. ఇది.. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650 తర్వాత ట్విన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ తీసుకొచ్చిన ఐదో 650cc మోటార్‌సైకిల్.
ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 స్క్రాంబ్లర్-బేస్డ్ డిజైన్‌తో వస్తుంది. కంపెనీ దీన్ని అనేక కొత్త ఫీచర్లు, ప్రీమియం మెకానికల్ పార్ట్స్‌తో రూపొందించింది. నవంబర్ 5న జరగబోయే EICMA 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బేర్ 650 ధరల వివరాలను వెల్లడించనుంది.
డిజైన్:ఈ బైక్ పెయింట్ స్కీమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో కూడిన టైర్లతో ఇంటర్‌సెప్టర్ 650 కంటే చాలా ఆకర్షణీయమైన కూల్ లుక్‌లో ఉంటుంది. దీని స్క్రాంబ్లర్ స్టైల్ సీట్, సైడ్ ప్యానెల్స్‌పై ఉన్న నంబర్ బోర్డ్ గ్రేట్ ఫ్లేవర్‌ని ఇస్తాయి. ఈ బైక్‌లోని LED లైట్స్, వీల్ సైజ్ చాలా భిన్నంగా ఉంటాయి.
ఈ బైక్‌లో స్పోక్ వీల్స్‌తో కూడిన MRF నైలోరెక్స్ ఆఫ్-రోడ్ టైర్‌లను అమర్చారు. ఏమైనప్పటికీ బైక్ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ మిస్సవుతుంది. షాట్‌గన్‌లో కనిపించే విధంగా ఇది షోవా USD ఫోర్క్‌లతో వస్తుంది. అయితే దీని ఇంటర్నల్ పార్ట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మొత్తంమీద సస్పెన్షన్ ట్రావెల్ ఇంటర్‌సెప్టర్ కంటే ఎక్కువగా ఉండటంతో సీటు ఎత్తు పెరిగింది.