తెలంగాణ

telangana

ETV Bharat / technology

వర్క్​ ఫ్రమ్ హోమ్​లో 'మౌస్ జిగ్లింగ్'​తో మాయ చేస్తున్నారా? ఇలా దొరికిపోతారు జాగ్రత్త! - Mouse Mover Technology

Remote Workers Using Mouse-Mover Technology Are Getting Caught : ఇంటి వద్ద ఉండి, మౌస్​ జిగ్లింగ్​ చేస్తూ, ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మిస్తున్న వారిపై అమెరికన్ బ్యాంక్​ వెల్స్​ ఫార్గో కఠిన చర్యలు తీసుకుంది. వారిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇంతకీ 'మౌస్ జిగ్లింగ్' అంటే ఏమిటి? ఇది చేస్తే ఉద్యోగం ఎందుకు ఊడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Remote workers using ‘mouse-mover’ technology are getting caught
Wells Fargo Fires Employees Over "Mouse Jiggling" (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 2:59 PM IST

Remote Workers Using Mouse-Mover Technology Are Getting Caught :మౌస్​ జగ్లింగ్ చేస్తూ, ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మిస్తున్న వారిపై అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంక్‌ 'వెల్స్‌ ఫార్గో' కఠిన చర్యలు తీసుకుంది. వారిని తక్షణమే విధుల నుంచి తొలగించింది. ఫైనాన్సియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ (ఫిన్రా)కు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

మౌస్ జిగ్లింగ్​ అంటే ఏమిటి?
ఆఫీస్​లో కాకుండా రిమోట్​గా (ఇంటి వద్ద నుంచి) పని చేసే ఉద్యోగులు కంప్యూటర్​పై వర్క్​ చేస్తుంటారు. ఒక వేళ మీరు పనిమీద బయటకు వెళ్లిపోయి, ఎక్కువ సేపు స్క్రీన్ వాడకుంటే ఉంటే, ఆ సిస్టమ్ స్లీప్​ మోడ్​లోకి వెళ్లిపోతుంది. ఈ విషయం వెంటనే సదరు కంపెనీకి తెలిసిపోతుంది. అందుకే తమ సిస్టమ్ స్లీప్​ మోడ్​లోకి వెళ్లకుండా నియంత్రించేందుకు కొంత మంది ఉద్యోగులు 'మౌస్​-మూవర్ టెక్నాలజీ'ని వాడారు. దీనినే 'మౌస్​ జిగ్లింగ్' అని కూడా అంటారు. ఇది మనుషుల ప్రమేయం లేకుండానే మౌస్ కర్సర్​ను యాక్టివేట్ చేస్తుంటుంది. ఇది నిరంతరంగా మౌస్​ను కదిలిస్తూ ఉంటుంది. కనుక ఉద్యోగి పని చేయకున్నా, అతను పనిచేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. వాస్తవానికి ఇది ఉద్యోగరీత్యా అనైతికం. అందుకే ఈ మోసాన్ని గుర్తించిన వెల్స్​ ఫార్గో 'మౌస్​ జిగ్లర్స్'​ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించింది.

ఉద్యోగం ఊడుతుంది - జాగ్రత్త!
పెద్ద పెద్ద కంపెనీలు తమ రిమోట్ ఉద్యోగులను పర్యవేక్షించడానికి అధునాతన నిఘా సాధనాలు ఉపయోగిస్తుంటాయి. ఈ టూల్స్​ మీ కీస్ట్రోక్స్, ఉద్యోగుల కంటి కదలికలను ట్రాక్ చేస్తుంటాయి. అలాగే మీ యాక్టివిటికి సంబంధించిన స్క్రీన్​షాట్​లు తీస్తుంటాయి. అలాగే మీరు చూస్తున్న వెబ్​సైట్స్​ వివరాలు కూడా కనిపెడుతున్నాయి. కనుక ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే కొందరు ఉద్యోగులు అతి తెలివిగా వ్యవహరిస్తున్నారు. మౌస్​ జిగ్లర్స్​ లాంటి పరికరాలతో, వర్క్​ చేస్తున్నట్లు కంపెనీలను మభ్యపెడుతున్నారు. అమెజాన్ రిపోర్ట్స్​ ప్రకారం, కేవలం 10 డాలర్ల (సుమారు రూ.850)కే ఇలాంటి పరికరాలు ఈ-కామర్స్ వెబ్​సైట్లలో దొరుకుతున్నాయి. వీటితో ఉద్యోగులు ఇలాంటి అనైతిక విధానాలు పాటిస్తున్నారు. దీనితో కంపెనీల ఉత్పాదక భారీగా తగ్గిపోతోంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలన్నీ ఈ విషయాన్ని చాలా సీరియస్​గా తీసుకుంటున్నాయి. పని చేస్తున్నట్లు నటిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే వర్క్​ఫ్రమ్ హోమ్​ను ఆపేసి, కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు కొవిడ్​ మహమ్మారి తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్​ (రిమోట్​ వర్కింగ్) బాగా పెరిగిపోయింది. దీనితో కొంత మంది ఉద్యోగులు 'మౌస్​ జిగ్లింగ్' లాంటి అనైతికమైన పనులు చేస్తున్నారు.

మౌస్ జిగ్లింగ్​ను ఎలా గుర్తిస్తారు?

  • కంపెనీకి సంబంధించిన కంప్యూటర్‌లో మౌస్‌ జిగ్లింగ్‌కు సంబంధించిన అనధికార యాప్‌లు ఉన్నాయో, లేదో తనిఖీ చేస్తారు.
  • వాస్తవానికి మౌస్ మూవర్​లు కేవలం మౌస్‌ను మాత్రమే కదిలిస్తాయి. అవి ఎటువంటి సందేశాలకూ ప్రతిస్పందించవు.
  • మౌస్​ జిగ్లర్​లు కాల్​ లిఫ్ట్​ చేయడం, మెసేజ్ చూడడం లాంటివి చేయలేవు.
  • పైగా మౌస్ కదలికలను ప్రత్యేకమైన యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల ద్వారా సులువుగా ట్రాక్‌ చేయవచ్చు.
  • వెల్స్ ఫార్గో కూడా ఇలాంటి చిట్కాలనే ఉపయోగించి మౌస్​ జిగ్లింగ్ చేస్తున్న ఉద్యోగులను పట్టుకోగలిగింది.

సైబర్ నేరగాళ్లు మీ ఐడెంటిటీని దొంగిలిస్తారు - పారా హుషార్! - What Is Identity Theft

రూ.2000 బడ్జెట్లో మంచి ఇయర్​బడ్స్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Earbuds Under 2000

ABOUT THE AUTHOR

...view details