తెలంగాణ

telangana

ETV Bharat / technology

కొత్త నంబర్ల నుంచి మిస్డ్​కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే? - PREMIUM RATE CALL SCAM

మిస్డ్​కాల్ వచ్చిందని తిరిగి ఫోన్ చేశారో మీ జేబు గుల్లే!- యూజర్లకు జియో అలర్ట్!

Premium Rate Call Scam
Premium Rate Call Scam (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : 18 hours ago

Premium Rate Call Scam: కష్టపడి సంపాదించడమే కాదు దాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ సైబర్ నేరాల ఉద్ధృతిలో ఆ మాటే మిథ్య అవుతోంది. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాలతో ప్రజల జేబులు గుల్ల గుల్ల అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తుంది.

ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటూ ఈ కేటుగాళ్లు గంటల వ్యవధిలోనే జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులూ సైబర్ వలలో చిక్కుకుని బాధితులుగా మారడం విస్తుపోయేలా చేస్తోంది. ఇలా అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్స్‌ చేసి మభ్యపెట్టి ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు మిస్డ్‌ కాల్స్‌తో టెలికాం యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు.

దీంతో ఈ తరహా మోసాలపై ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన యూజర్లను అలర్ట్‌ చేసింది. ప్రీమియం రేట్‌ సర్వీస్‌ స్కామ్ పేరిట జరుగుతున్న ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించొద్దని పేర్కొంది. ఈ సందర్భంగా ఏంటీ ప్రీమియం రేట్​ కాల్ స్కామ్? వీటి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? వంటి వివరాలు మీకోసం.

ఏంటీ ప్రీమియం రేట్‌ కాల్‌ స్కామ్‌?:

  • మొదట మీకు గుర్తుతెలియని ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి మీ నంబర్​కు మిస్డ్​ కాల్ వస్తుంది.
  • అది ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతలో తిరిగి కాల్ చేశారో మీకు బిల్లు మోత మోగిపోవడం ఖాయం.
  • మీకు ఎవరు కాల్​ చేశారో తెలుసుకునే క్రమంలో మీరు తిరిగి కాల్‌ చేస్తే అది ప్రీమియం రేట్‌ సర్వీస్‌కు కనెక్ట్‌ అవుతుంది.
  • దీంతో మీకు పెద్ద మొత్తంలో బిల్లు పడుతుంది.
  • సాధారణ అంతర్జాతీయ నంబర్లకు చేసే కాల్స్‌తో పోలిస్తే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే వచ్చే బిల్ ధర అధికంగా వస్తుంది.
  • మీరు మాట్లాడేది చాలా తక్కువ సమయమే అయినా నిమిషానికి వందల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ తరహా కాల్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో జియో తన వినియోగదారులను అప్రమత్తం చేసింది.

వీటి బారి నుంచి తప్పించుకోవడం ఎలా?:

  • సాధారణంగా నంబర్ల ముందు +91తో కాకుండా వేరే నంబర్లతో వచ్చే వాటిని ఇంటర్నేషనల్ కాల్స్​గా పరిగణిస్తారు.
  • మీకు అలాంటి నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే అస్సలు స్పందించొద్దు.
  • దీంతోపాటు తెలియని కొత్త నంబర్​ల నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినా తిరిగి కాల్‌ చేయకుండా ఉండటమే మంచిది.
  • అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ నంబర్​ను బ్లాక్ చేసి భవిష్యత్‌లో ఇకపై దాని​ నుంచి మీకు కాల్స్‌ రాకుండా జాగ్రత్తపడండి.
  • ఈ తరహా మోసాలు ఇంకెవరికీ జరగకుండా ఉండేందుకు దీనిపై మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేసి వారికి సరైన అవగాహన కల్పించండి.
  • ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు సైబర్ వలలో చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

వన్​ప్లస్ 13 vs ఐకూ 13- వీటిలో ది బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఏది?- డిజైన్ నుంచి ధర వరకు పూర్తి వివరాలివే!

ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా- ఇన్నిసార్లు పోస్ట్​పోన్ ఎందుకు?- శాస్త్రవేత్తల ముందున్న సవాల్ అదేనా?

భారత్​లో 5.5G వచ్చేసిందోచ్- ఇకపై ఎక్కడ ఉన్నా సూపర్​ ఫాస్ట్ నెట్​వర్క్!- ఇది ఏ డివైజ్​లో పనిచేస్తుందంటే?

ABOUT THE AUTHOR

...view details