JIO Anniversary Offers: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరే శుభవార్త తెచ్చింది. జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి సంవత్సం లాగానే ఈ ఏడాది కూడా యూజర్లకు ప్రత్యేక ఆఫర్లను అనౌన్స్ చేసింది. తన మూడు రీఛార్జ్ ప్లాన్లతో పాటు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేది లోపు రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
జియో ప్రకటించిన ఆఫర్స్ ఇవే:
- జియో వార్షిక ప్రయోజనాల్లో భాగంగా రీఛార్జిలపై 175 రూపాయల విలువైన వోచర్ అందిస్తోంది.
- ఈ వోచర్ కింద 28 రోజుల పాటు 10 ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు, 10జీబీ డేటా పొందొచ్చు.
- జియో బెస్ట్ క్వార్టర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయిన రూ. 899, రూ. 999, బెస్ట్ యాన్యువల్ ప్లాన్ అయిన రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్ పైన అదనపు బెనిఫిట్స్ ప్రకటించింది.
- అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.
- దీంతోపాటు Ajioలో రూ. 2,999 పైబడి షాపింగ్ చేసే వారికి రూ. 500 విలువైన అజియో వోచర్ కూడా అందించనుంది.
- రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో Ajioలో షాపింగ్ చేసేటప్పుడు ఈ కూపన్ వర్తిస్తుంది.
- వీటితో పాటు 3 నెలల Zomato Gold Membership ను కూడా ఈ ఆఫర్లో భాగంగా ఉచితంగా అందిస్తుంది.
- ఈ ఆఫర్లు జియో అందిస్తున్న మూడు రీఛార్జి ప్లాన్‌లకే వర్తిస్తాయి.
రీఛార్జ్ ప్లాన్లు ఇవే:
- జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్‌తో 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. దీంతోపాటు 20జీబీ డేటా అదనం.
- దీంతోపాటు 98 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చిన మరో ప్లాన్ ధర రూ.999. ఈ రీఛార్జిపై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు.
- జియో అందిస్తున్న రూ.3,599 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.