Redmi Turbo 4 Launched: రెడ్మీ టర్బో 4 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది షావోమీ సబ్-బ్రాండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్. కంపెనీ దీన్ని మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్‌తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని భారత్‌తో సహా ప్రపంపంచలోని ఇతర మార్కెట్లలో 'పోకో X7 ప్రో' పేరుతో తీసుకురావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఈ జనవరి 9వ తేదీన ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా 'రెడ్మీ టర్బో 4' మొబైల్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
Redmi Turbo 4 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఈ ఫోన్ 6.67 అంగుళాల TCL Huaxing 1.5K ఫ్లాట్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, పీక్ బ్రైట్నెస్ 3200 నిట్స్. ఈ డిస్ప్లే HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది.
ప్రాసెసర్:ఈ ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం కంపెనీ.. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్‌ను అందించింది. ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్.
కెమెరా: OIS సపోర్ట్‌తో 50MP Sony LYT-600 మెయిన్ సెన్సార్ ఈ ఫోన్ వెనక భాగంలో అమర్చారు. ఫోన్ సెకండ్ బ్యాక్ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్:ఈ కొత్త 'రెడ్మీ టర్బో 4' స్మార్ట్‌ఫోన్‌లో 6,550mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ HyperOS 2 పై రన్ అవుతుంది.