Redmi Note 14 Series Launched in India:మార్కెట్లోకి ఒకేసారి మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీకి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ తన 'నోట్ 14' సిరీస్‌ను లాంఛ్ చేసింది. వీటి పాత మోడల్స్‌తో పోలిస్తే వీటిలో చాలా మార్పులు చేసినట్లు కంపెనీ చెబుతోంది. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
రెడ్‌మీ కొత్త ఫోన్లు ఇవే:
- రెడ్‌మీ నోట్ 14
- రెడ్‌మీ నోట్ 14 ప్రో
- రెడ్‌మీ నోట్ 14 ప్రో+
1. 'రెడ్‌మీ నోట్ 14' స్పెసిఫికేషన్లు:రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌లో 'రెడ్‌మీ నోట్ 14' అనేది బేస్ మోడల్ మొబైల్.
- డిస్ప్లే:6.67 అంగుళాల అమోలెడ్
- రిఫ్రెష్ రేటు: 120Hz
- పీక్ బ్రైట్‌నెస్:2100 నిట్స్
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్‌సిటీ 7025 అల్ట్రా చిప్
- బ్యాటరీ:5110 ఎంఏహెచ్
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా సెటప్:ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఎంట్రీ ఇచ్చింది.
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- సెకండ్ కెమెరా:2 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
వేరియంట్స్:
- 6జీబీ+128జీబీ
- 8జీబీ+128జీబీ
- 8జీబీ+256జీబీ
వేరియంట్ల వారీగా ధరలు:
- 6జీబీ+128జీబీ ధర: రూ.17,999
- 8జీబీ+128జీబీ ధర: రూ.18,999
- 8జీబీ+256జీబీ ధర: రూ.20,999
2. 'రెడ్‌మీ నోట్ 14 ప్రో' స్పెసిఫికేషన్లు:
- డిస్ప్లే:6.67 అంగుళాల 1.5k అమోలెడ్
- రిజల్యూషన్: 1.5k
- రిఫ్రెష్ రేట్: 120Hz
- గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్
- ప్రాసెసర్:మీడియాటెక్ డైమెన్‌సిటీ 7,300 అల్ట్రా చిప్
- బ్యాటరీ: 5,500 ఎంఏహెచ్
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా సెటప్:
- రియర్ కెమెరా:50 ఎంపీ
- అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్: 8 ఎంపీ
- మాక్రో సెన్సర్:2 ఎంపీ
అయితే ఈ మొబైల్లో ముందువైపు ఏఐ సెల్ఫీ కెమెరా ఇచ్చామని కంపెనీ పేర్కొన్నప్పటికీ.. ఎన్ని మెగాపిక్సల్ అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
వేరియంట్స్:
- 8జీబీ+128జీబీ
- 8జీబీ+ 256జీబీ