తెలంగాణ

telangana

ETV Bharat / technology

టాప్ క్లాస్ ఫీచర్లతో రెడ్​మీ కొత్త మొబైల్స్- రేటు చూస్తే ఒక్క క్షణం కూడా ఆగలేరు..! - REDMI K80 SERIES

రెడ్​మీ 'K80' సిరీస్ వచ్చేశాయ్- ధర, ఫీచర్లు ఇవే..!

Redmi K80 Series Launched
Redmi K80 Series Launched (Xiaomi)

By ETV Bharat Tech Team

Published : Nov 28, 2024, 3:45 PM IST

Redmi K80 Series Launched:ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ షావోమీకి చెందిన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ కొత్త 'K80' సిరీస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ లైనప్‌లో రెండు మోడళ్లను చేర్చింది. అవి 'రెడ్​మీ K80', 'రెడ్​మీ K80 ప్రో'. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్​ను అమర్చారు. అవి 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

వీటిలో రెడ్​మీ 'K80 ప్రో' మొబైల్ 2.5X ఆప్టికల్ జూమ్‌తో అదనంగా 50-మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఇది బేస్ మోడల్‌లో అందుబాటులో లేదు. ఈ సిరీస్​ డస్ట్ అండ్ వాటర్ రెసిస్సెన్సీతో వరుసగా IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​తో కూడా వస్తుంది. ఇవి 2160Hz ఇన్​స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డాల్బీ విజన్​కు సపోర్ట్ చేస్తాయి.

రెడ్​మీ K80, రెడ్​మీ K80 Pro స్పెసిఫికేషన్లు:

  • డిస్​ప్లే: 6.67-అంగుళాల (1,440 x 3,200 పిక్సెల్‌లు) 12-బిట్ AMOLED
  • రిజల్యూషన్: 2K
  • రిఫ్రెష్ రేట్‌:120Hz
  • బ్రైట్​నెస్: 3,200 నిట్స్

స్నాప్​డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ బేస్ 'K80' మోడల్‌లో ఇన్‌స్టాల్ చేశారు. ఇక 'ప్రో' మోడల్​లో క్వాల్​కామ్​ ఫ్లాగ్‌షిప్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ SoC K80 చిప్​సెట్​ను అమర్చారు. ఈ రెండు మొబైల్స్ కూడా 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉన్నాయి. రెడ్​మీ 'K80', 'K80 ప్రో' రెండూ సరికొత్త Xiaomi HyperOS 2.0 పై రన్ అవుతాయి.

కెమెరా సెటప్:రెడ్​మీ 'K80' డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 'K80 ప్రో' బేస్ మోడల్ మాదిరిగానే అదే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే ఇది అదనంగా 2.5x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు:

  • USB టైప్-సి పోర్ట్
  • బ్లూటూత్ 5.4
  • Wi-Fi 7
  • 5G
  • 4G VoLTE

అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. రెడ్​మీ 'K80' మోడల్ 120W (వైర్డ్), 50W (వైర్‌లెస్) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక 'K80 ప్రో' మోడల్ ఫోన్​ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,550mAh బ్యాటరీని కలిగి ఉంది.

ధర:

కంపెనీ రెడ్​మీ 'K80' 12GB + 256GB మోడల్ ధరను CNY 2,499 (సుమారు రూ. 29,000)గా నిర్ణయించింది. దీంతోపాటు మరో నాలుగు కాన్ఫిగరేషన్​లలో కూడా ఈ మొబైల్అందుబాటులో ఉంది. దీనిలో 16GB + 1TB వేరియంట్ CNY 3,599 (సుమారు రూ. 42,000) ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

రెడ్​మీ 'K80' కలర్ ఆప్షన్స్:

  • మౌంటైన్ గ్రీన్
  • మిస్టీరియస్ నైట్ బ్లాక్
  • స్నో రాక్ వైట్
  • ట్విలైట్ మూన్ బ్లూ

మరోవైపు రెడ్​మీ 'K80 ప్రో' బేస్ వేరియంట్ 12GB + 256GB ప్రారంభ ధర CNY 3,699 (సుమారు రూ. 43,000). దీన్ని కూడా కంపెనీ మరో నాలుగు ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్​లో తీసుకొచ్చింది. వీటిలో దాని టాప్-ఎండ్ 16GB + 1TB వేరియంట్ ధర CNY 4,799 (సుమారు రూ. 56,000).

రెడ్​మీ 'K80 ప్రో' కలర్ ఆప్షన్స్:

  • మౌంటైన్ గ్రీన్
  • మిస్టీరియస్ నైట్ బ్లాక్
  • స్నో రాక్ వైట్

ఇది కాకుండా షావోమీ.. 'రెడ్​మీ K80 ప్రో' ఛాంపియన్స్ ఎడిషన్ మోడల్‌ను కూడా పరిచయం చేసింది. ఇది 'ఆటోమొబిలి లంబోర్ఘిని రేసింగ్ టీమ్' బ్రాండింగ్‌ను కలిగి ఉంది. దీని ధర CNY 4,999 (సుమారు రూ. 58,000).

మహింద్రా 'BE 6e' vs టాటా 'కర్వ్' ఈవీ- దేని రేంజ్ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్ మనీ?

బిగ్ బ్యాటరీతో రియల్​మీ నయా ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట..!

ABOUT THE AUTHOR

...view details