తెలంగాణ

telangana

ETV Bharat / technology

IP52 రేటింగ్, పవర్​ఫుల్ ప్రాసెసర్, బిగ్ స్క్రీన్​తో రెడ్​​మీ 14C 5G- ధర కూడా రూ.10వేల లోపే! - REDMI 14C 5G

కిర్రాక్ ఫీచర్లతో రెడ్​మీ 14C 5G లాంఛ్- ధర, ఫీచర్లు ఇవే..!

Redmi 14C 5G Launched in India
Redmi 14C 5G Launched in India (Photo Credit- Xiaomi)

By ETV Bharat Tech Team

Published : Jan 6, 2025, 3:43 PM IST

Redmi 14C 5G:షావోమీ సబ్-బ్రాండ్ రెడ్​మీ ఇండియన్ మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్​మీ 14C 5G పేరుతో దీన్ని తీసుకొచ్చింది. చైనీస్ స్మార్ట్​ఫోన్ కంపెనీ షావోమీ ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ను బడ్జెట్ రేంజ్​లోనే రిలీజ్ చేసింది. రూ.10,000లోపే ఇది లాంఛ్ కావడం విశేషం. ఈ ఫోన్ రెడ్​మీ 13C అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ కొత్త వెర్షన్​లో వినియోగదారులు కొత్త డిజైన్, పెద్ద స్క్రీన్ అండ్ బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్​తో సహా అనేక ప్రత్యేకమైన ఫీచర్లను పొందొచ్చు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

  • డిస్​ప్లే: రెడ్​మీ 14C 5G స్మార్ట్​ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్​ రేట్ 120Hz. ఈ ఫోన్ వెనక భాగంలో గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంది.
  • ప్రాసెసర్:ఇందులో క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 4 Gen 2 చిప్‌సెట్ ఉంది.
  • సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Xiaomi HyperOSలో రన్ అవుతుంది.
  • కెమెరా: దీని వెనక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్​ కోసం ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ:ఈ ఫోన్ 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే మీరు ఈ ఫోన్​ బాక్స్​లో 33W ఫాస్ట్ ఛార్జర్‌ని పొందుతారు.
  • ఇతర ఫీచర్లు:ఈ ఫోన్ ఇతర ఫీచర్లలో అత్యంత ముఖ్యమైనది IP52 రేటింగ్. ఇది వాటర్ డ్రాప్స్​, డస్ట్​ నుంచి ఫోన్​ను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ రేంజ్​ ఫోన్లలో ఈ ఫీచర్ చాలా అరుదుగా కన్పిస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్​ఫోన్​ 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టింగ్ ఫీచర్లతో వస్తుంది.

వేరియంట్స్:కంపెనీ ఈ ఫోన్‌ను మూడు వేరియంట్‌లలో తీసుకొచ్చింది.

  • 4GB + 64GB
  • 4GB + 128GB
  • 6GB + 128GB

ABOUT THE AUTHOR

...view details