Range Rover SV New Edition: ల్యాండ్ రోవర్ ఇండియా తన మొట్ట మొదటి ఇండియా ఎక్స్‌క్లూజివ్ రేంజ్ రోవర్ మోడల్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అయితే కంపేనీ ఈ ప్రత్యేక ఎడిషన్ సేల్స్‌ను 12 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ కారును విక్రయించడం ద్వారా వచ్చిన నగదులో కొంత భాగాన్ని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్‌కు విరాళంగా అందజేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ కారును కంపెనీ స్పెషల్ వెహికల్ (SV) విభాగం రూపొందించింది. రేంజ్ రోవర్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్ అనేది రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందింది. దేశంలోని వన్యప్రాణులతో విశిష్టమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తూ పులికి చిహ్నంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రత్యేక పెయింట్ స్కీమ్‌తో బ్లాక్ బాడీ కలర్‌లో రెడ్ షిమ్మర్‌తో దీన్ని రూపొందిచారు. ఈ రణథంబోర్ ఎడిషన్‌లో పులి చారలతో కూడిన డిజైన్ కూడా కన్పిస్తుంది.
ప్రకృతి స్ఫూర్తితో అద్భుతమైన ఇంటీరియర్:
- ఈ సరికొత్త కారు లోపల నాలుగు-సీట్ల క్యాబిన్ ఉంది.
- దీన్ని కారావే అండ్ లైట్ పెర్లినో సెమీ-అనిలిన్ లెదర్‌తో తయారు చేశారు.
- ఇది సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్, టైగర్ స్ట్రిప్ ఇన్‌స్పైర్డ్ ఎంబ్రాయిడరీని కలిగి ఉంది.
- ఇందులో కస్టమ్ స్కాటర్ కుషన్‌లు, క్రోమ్ హైలైట్‌లు, లైట్ వెంగే వుడ్ వెనీర్, వైట్ సిరామిక్ డయల్ వంటి లగ్జరీ ఇంటీరియర్‌ను ప్రకృతి- ప్రేరేపిత థీమ్‌తో అందిచారు.
- సీట్లపై ఎంబ్రాయిడరీ పులి వెన్నెముక వెంట ఉన్న చారల మాదిరిగా కనిపిస్తుంది.
- దీంతోపాటు ఈ కారులో రిక్లినబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లోయబుల్ కప్‌హోల్డర్స్, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్‌మెంట్ వంటివి ఉన్నాయి.