తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్ యూజర్స్​కు బంపర్​ ఆఫర్- వాటికి లైఫ్​ టైమ్​ ఫ్రీ స్క్రీన్​ రీప్లేస్మెంట్..! - FREE REPAIR FOR MOBILES

ఆ మొబైల్స్​కు​ ఫ్రీ రిజల్యూషన్, లైఫ్​టైమ్​ వారంటీ- పండగ వేళ ఆఫర్ అదిరిందిగా!!!

Oneplus Offers Free Repair for Phones
Oneplus Offers Free Repair for Phones (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Oct 22, 2024, 4:23 PM IST

Free Repair for Mobiles:పండగ వేళ ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన యూజర్స్​కు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఎంపిక చేసిన పలు మోడల్ వన్​ప్లస్​ మొబైల్స్​కు జీవిత కాలం పాటు ఉచితంగా స్క్రీన్​ రీప్లేస్మెంట్​ను అందించనున్నట్లు ప్రకటించింది. డిస్​ ప్లే సమస్యలు ఉన్నవారు సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఫ్రీగా మార్పించుకోవచ్చుని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఇండియాలోని వినియోగదారులకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

ఆ కారణంగానే: ​గత కొన్ని నెలల నుంచి వన్​ప్లస్​ స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యంగా OnePlus 8, OnePlus 9 సిరీస్​లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కంప్లయింట్స్ వస్తున్నాయి. OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డివైజ్ మదర్‌బోర్డ్ ఫెయిల్యూర్, డిస్‌ప్లేలో గ్రీన్ లైన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు యూజర్స్​ క్లెయిమ్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన కంపెనీ యూజర్స్​కు స్క్రీన్​ రిలేటెడ్ సమస్యల వల్ల కలిగే అసౌకర్యంపై పరిష్కారాన్ని ప్రకటించింది.

యూజర్స్​ నుంచి కంప్లయింట్స్​ రావటంతో కంపెనీ.. మొబైల్స్​లో వస్తున్న సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో OnePlus 8, OnePlus 9 సిరీస్​ మొబైల్స్​లో ఉన్న సమస్యలను గుర్తించి ఫ్రీ రిజల్యూషన్, లైఫ్​టైమ్​ వారంటీని ప్రకటించింది. ఇందుకోసం సమీపంలోని వన్​ప్లస్​ సర్వీస్​ సెంటర్లను సందర్శరించమని తెలిపింది. అక్కడ మొబైల్​లో ఉన్న సమస్యలను గుర్తించి ఫ్రీ రిజల్యూషన్​ను అందిస్తారని వన్​ప్లస్​ హామీ ఇచ్చింది.

దీంతోపాటు వన్​ప్లస్ ఎంపిక చేసిన వన్​ప్లస్​ 8, 9 సిరీస్ డివైజెస్​కు అప్​గ్రేడ్ ప్రోగ్రామ్​ను ప్రకటించింది. సర్వీస్​ సెంటర్స్​లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఎఫెక్టెడ్​ మొబైల్స్​కు లైఫ్​టైమ్ స్క్రీన్​ వారంటీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఫోన్ ఎంత పాతది అయినా సరే గ్రీన్ లైన్ ప్లాబ్లమ్ ఉంటే వెంటనే పరిష్కారం కోసం సమీపంలో వన్​ప్లస్ సర్వీస్ సెంటర్​ను సంప్రదించొచ్చని చెప్పింది. ఇందులో డిస్​ప్లే రీప్లేస్మెంట్​తో లైఫ్​టైమ్ డిస్​ప్లే వారంటీ, కొత్త మొబైల్స్​కు అప్​గ్రేడ్ ప్రోగ్రామ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

టొయోటా ఫెస్టివల్ స్పెషల్ ఎడిషన్ లాంచ్- లిమిటెడ్ సేల్స్​.. వెంటనే త్వరపడండి..!

లిమిటెడ్ యాడ్స్​తో యూట్యూబ్ ప్రీమియం లైట్- ఇకపై యూజర్స్​కు పండగే..!

ABOUT THE AUTHOR

...view details