OnePlus Community Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇయర్ ఎండ్‌లో కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో కంపెనీ తన ఎంపిక చేసిన ఫోన్లు, ఇయర్ బడ్స్, టాబ్లెట్స్ తదితర ఉత్పత్తులపై ఆకర్షణీయమై ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక పెద్ద ఎత్తున బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఈ సేల్ ఎన్ని రోజులు ఉండనుంది?, కంపెనీ అందిస్తున్న ఆఫర్లు ఏంటి? వంటి వివరాలు మీకోసం.
స్మార్ట్‌ఫోన్లపై డీల్స్ ఇవే!:
కంపెనీ ఈ సేల్‌లో 'వన్‌ప్లస్ 12' మొబైల్‌పై భారీ ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. దీన్ని 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో రూ.64,999 ధరతో లాంఛ్ చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.6,000 తగ్గింపు ధరతో దీన్ని కేవలం రూ.58,999లకే అందిస్తోంది. అంతేకాక దీనిపై ICICI బ్యాంక్, వన్‌కార్డ్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు రూ.7వేలు డిస్కౌంట్ పొందొచ్చు.
మరోవైపు 'వన్‌ప్లస్ 12R' ఫోన్‌పై రూ.6 వేలు, బ్యాంకు కార్డులపై రూ.3 వేలు డిస్కౌంట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో ఫోన్ధర రూ.35,999 పలుకుతుంది.
ఇక కంపెనీ లేటెస్ట్గా తీసుకొచ్చిన 'వన్‌ప్లస్ నార్డ్ 4' స్మార్ట్‌ఫోన్లపై కూడా ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ మోడల్లోని సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.3,000 ధర తగ్గింపు, ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది.
వీటితో పాటు వన్‌ప్లస్ 'నార్డ్ CE4', 'నార్డ్ CE4 లైట్' మొబైల్స్‌పై రూ.2 వేలు డిస్కౌంట్, వెయ్యి రూపాయల ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ మొబైల్ రూ.24,999 నుంచి రూ.22,999 ధరకు దిగి వస్తుంది. దీంతోపాటు వన్‌ప్లస్ 'నార్డ్ బడ్స్ 2ఆర్' పొందొచ్చు.
కంపెనీ 'వన్‌ప్లస్ ఓపెన్' పేరుతో గ్లోబల్‌గా లాంఛ్ చేసిన తన మొట్ట మొదటి ఫోల్డబుల్ ఫోన్‌పై కూడా అదిరే ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,49,999 ఉండగా ఈ సేల్‌లో భాగంగా అందిస్తున్న డిస్కౌంట్లో దీన్ని రూ.1,34,999లకే సొంతం చేసుకోవచ్చు.