తెలంగాణ

telangana

ETV Bharat / technology

లేటెస్ట్ ప్రాసెసర్, హై ఎండ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. ప్రీమియం ఫీచర్లతో 'వన్​ప్లస్ 13' వచ్చేస్తోంది..!

ఇండియన్ మార్కెట్లోకి త్వరలో 'వన్​ప్లస్ 13' ఎంట్రీ- ధర, ఫీచర్లు ఇవే..!

OnePlus 13 Smartphone
OnePlus 13 Smartphone (OnePlus)

By ETV Bharat Tech Team

Published : 18 hours ago

OnePlus 13 Smartphone Launch: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'OnePlus 13'ను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతోంది. దీని ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ 'iQOO 13' నిన్ననే భారత మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ క్రమంలో 'OnePlus 13' మొబైల్ కూడా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇది 'iQOO 13' ఫోన్‌కు గట్టి పోటీని ఇవ్వగలదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి ఇప్పటికే కొంత సమాచారం రివీల్ అయింది. అదేంటో తెలుసుకుందాం రండి.

'OnePlus 13' లాంఛ్ డేట్..?: ఈ 'OnePlus 13' మొబైల్ ఇటీవలే అక్టోబర్ 2024లో చైనాలో లాంఛ్ అయింది. ఇది క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​సెట్​తో చైనీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ మొబైల్​ను జనవరి 2025లో గ్లోబల్​గా లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గ్లోబల్​ మార్కెట్లో కంపెనీ 'R' సిరీస్​ స్మార్ట్​ఫోన్​ 'OnePlus 13R'తో పాటు రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ 'OnePlus 13R' మొబైల్ చైనాలో 'OnePlus Ace 5' పేరుతో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.

'OnePlus 13' ఫీచర్లు:

  • డిస్​ప్లే:క్వాడ్-కవర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.82-అంగుళాల AMOLED
  • రిజల్యూషన్:3168x1440
  • రిఫ్రెష్​ రేట్​: 120Hz
  • బ్రైట్​నెస్:4,500 nits
  • డాల్బీ విజన్ HDR
  • అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • ర్యామ్: 24GB LPDDR5X వరకు
  • స్టోరేజీ: గరిష్టంగా 1TB UFS 4.0
  • వెనుక కెమెరా: OISతో 50MP ప్రైమరీ (Sony LYT 808), 50MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో (3x జూమ్, OIS)
  • ఫ్రంట్ కెమెరా: 32MP
  • బ్యాటరీ:6,000mAh
  • ఛార్జింగ్: 100W వైర్డు, 50W వైర్‌లెస్
  • ప్రొటెక్షన్: IP68, IP69
  • బరువు: 210 గ్రాములు

కెమెరా సెటప్:స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50MP సోనీ LYT 808 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ వంటివి ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీ కోసం ఇందులో 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించొచ్చు.

ధర: ఇండియాలో ప్రీమియం 'OnePlus 13' ధర రూ. 70,000లోపు ఉండొచ్చు. 'OnePlus 13' ఈ ధర ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడేలా చేస్తుంది. ఇక కంపెనీ ప్రీవియస్ మోడల్'OnePlus 12' ధరను పరిశీలిస్తే భారత మార్కెట్లో దీని ధర రూ. 64,999గా ఉంది.

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

ఓలా ఎలక్ట్రిక్ యూజర్లకు గుడ్​న్యూస్- ఒకేసారి ఏకంగా 3200 స్టోర్లు.. ఇక సర్వీసులకు తగ్గేదేలే..!

ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details