Triumph Tiger Sport 800:బ్రిటిష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన కొత్త ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 800 బైక్‌ను పరిచయం చేసింది. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపర్చేందుకు ఇందులో ప్రీమియం పార్ట్స్ అమర్చారు. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను యూరోపియన్ మార్కెట్స్‌లో లాంచ్ చేసింది. 2024 చివరి నాటికి ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
డిజైన్: ఈ కొత్త మోటార్‌సైకిల్ డిజైన్ దాని స్మాలర్ మోడల్ టైగర్ స్పోర్ట్ 660 బైక్‌ను పోలి ఉంటుంది. ఇది LED హెడ్‌ల్యాంప్స్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, ఇతర ఫీచర్లతో స్పోర్ట్ టూరర్ డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ సెంటర్-సెట్ ఫుట్‌పెగ్స్, విశాలమైన హ్యాండిల్‌బార్, పెద్ద సీటుతో నిటారుగా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులో స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కోసం LCD యూనిట్, సెట్టింగ్స్ యాక్సెస్ చేసేందుకు స్మాల్ కలర్డ్ TFT యూనిట్, స్మార్ట్‌ఫోన్ సంబంధిత ఫీచర్లు, మ్యూజిక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ మధ్య టోగుల్ చేయడానికి ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను కూడా కలిగి ఉంది.
ఇంజిన్: ఈ బైక్ ఒక కొత్త 798cc ఇన్‌లైన్-ట్రిపుల్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 10,750 rpm వద్ద 113.43 bhp గరిష్ట పవర్, 8,250 rpm వద్ద 95 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో స్లిప్పర్ క్లచ్, క్విక్‌షిఫ్టర్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. దీని ఇంజిన్ రైడ్-బై-వైర్‌తో వస్తుంది. ఇది రోడ్, రైన్, స్పోర్ట్ వంటి మూడు రైడ్ మోడలను అందిస్తుంది. ఈ బైక్‌లో 18.5 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది ఫుల్ ట్యాంక్‌పై సుమారు 380 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సమాచారం.