New Maruti Dzire vs Old Dzire:మారుతి సుజుకి ఇటీవలే ఇండియన్ మార్కెట్లో తన ఫోర్త్-జనరేషన్ మారుతి డిజైర్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ కారును రూ.6.79 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. ఈ కొత్త డిజైర్‌లో డిజైన్ నుంచి ఇంజిన్, ఫీచర్లలో మేజర్ అప్డేట్స్ చేశారు. ఈ నేపథ్యంలో పాత డిజైర్‌తో పోలిస్తే ఈ కొత్త కారులో ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్: ఈ రెండు కార్ల ఓవరాల్ సిల్హౌట్ ఎక్కువ లేదా తక్కువలు ఒకేలా ఉన్నప్పటికీ ఏటవాలు రూఫ్, దాదాపు విలక్షణమైన మూడు-బాక్సీ డిజైన్‌తో కొత్త డిజైర్ ఫ్రంట్ లుకింగ్ మరింత అప్డేటెడ్గా ఉంటుంది. పాత మోడల్లా కాకుండా కొత్త డిజైర్ ఎక్స్టీరియర్.. మారుతి స్విఫ్ట్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది.
Dimensions | New Maruti Dzire | Old Maruti Dzire |
Length | 3,995 mm | 3,995 mm |
Width | 1,735 mm | 1,735 mm |
Height | 1,525 mm | 1,515 mm |
Wheelbase | 2,450 mm | 2,450 mm |
Ground Clearance | 163 mm | 163 mm |
Boot Space | 382 litres | 378 litres |
Wheels and Tires | 185/65 R15 | 185/65 R15 |
Curb Weight | 920-1025 kg | 880-995 kg |
దీనిలో LED DRLతో వచ్చే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సిక్స్ హారిజంటల్ స్లాట్లుతో దీని కొత్త బ్లాక్ హెక్సాగోనల్ గ్రిల్ పాత మోడల్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. దీని టాప్ పియానో బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్‌తో వస్తుంది. కారు హెడ్‌లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ మధ్య కొంచెం ఖాళీ ఉంటుంది. ఇవి హై-స్పెక్ వేరియంట్స్‌లో LED యూనిట్లుగా ఉంటాయి.
ఇంటీరియర్: ఈ కారును మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. అయితే ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్ సెడాన్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త డిజైర్ డ్యాష్‌బోర్డ్ చాలా మోడ్రన్, మల్టీ లేయర్ డిజైన్‌ను కలిగి ఉంది. మధ్యలో ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఉంది. ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త డయల్స్, MIDతో వస్తుంది. అంతేకాక ఇందులో ఆటో AC, కొత్తగా రూపొందించిన AC వెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త డిజైర్ క్యాబిన్లో అతిపెద్ద మార్పు దాని ఫీచర్ల లిస్ట్‌లో ఉంది. ఇది దాని ప్రీవియస్ మోడల్ కంటే చాలా పొడుగ్గా ఉంది. ఇది పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్, సెగ్మెంట్‌లో మొదటిసారిగా పవర్డ్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సుజుకి కనెక్ట్ ఇన్-కార్ కనెక్టివిటీ సూట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.