తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్మార్ట్​ ఫోన్​ను వారానికొకసారి రీస్టార్ట్ చేస్తే చాలు- సైబర్ దాడుల నుంచి ఫుల్ సేఫ్! - Mobile Security Tips

Mobile Security Tips : స్మార్ట్‌ ఫోన్స్ వినియోగం ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయింది. వ్యక్తిగత అవసరాల నుంచి బ్యాంకింగ్‌ సేవల వరకు అనేక మంది స్మార్ట్‌ ఫోన్‌ పైనే ఆధారపడుతున్నారు. అదే సమయంలో సైబర్‌ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ భద్రతా సంస్థ కీలక డాక్యుమెంట్​ను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్​లో సైబర్​ దాడుల నుంచి రక్షణ కోసం అనేక కీలక సూచనలు చేసింది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Mobile Security Tips
Mobile Security Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 1:26 PM IST

Mobile Security Tips : మీరు ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌ను వాడుతున్నారా? అయితే మీ ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలంటే ప్రతి వారం రోజులకోసారి వాటిని తప్పనిసరిగా రీస్టార్ట్‌ చేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) సూచించింది. సైబర్‌ నేరగాళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు పాటించాల్సిన పద్ధతులను వివరిస్తూ కొన్నేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఏ రూపొందించిన ఓ డాక్యుమెంట్‌ ఇటీవల విడుదల చేసింది.

సైబర్‌ దాడులతోపాటు మాల్‌వేర్‌ బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు తమ స్మార్ట్‌ ఫోన్లను వారానికోసారి రీస్టార్ట్‌ చేసుకోవాలని ఆ డాక్యుమెంట్‌లో ఎన్‌ఎస్‌ఏ సూచించినట్టు ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది. 2010 తొలినాళ్లలో తయారైన ఫోన్లను, ముఖ్యంగా హోం బటన్‌ కలిగిన ఐఫోన్లతో పాటు కొన్ని శాంసంగ్‌ గెలాక్సీ డివైజ్‌ల గురించి ప్రస్తావిస్తూ ఎన్‌ఎస్‌ఏ ఈ సూచన చేసినట్టు తెలిపింది. ఇది ఇప్పటికీ విలువైన సూచనేనని, స్మార్ట్‌ ఫోన్లను రీస్టార్ట్ట్‌ చేయడం ద్వారా కనీసం కొన్ని సైబర్‌ దాడులనైనా నిరోధించవచ్చని ఆ పత్రిక పేర్కొంది.

ఆటోమేటిక్ రీస్టార్​ ఆప్షన్
అలాగే స్మార్ట్​ఫోన్స్​కు బయోమెట్రిక్ లాక్ వేయడం, ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్స్ వాడటం వంటివి చేయాలని డాక్యుమెంట్​లో పేర్కొంది. అలాగే ఫోన్స్​ తరచుగా రీస్టార్ట్ చేయడం వల్ల మెమరీ లీక్స్, బగ్గీ యాప్స్​ను నివారించవచ్చని తెలిపింది. ఒకవేళ మీరు వారానికొకసారి ఫోన్​ను రీస్టార్ట్ చేయడానికి బద్దకిస్తే మరో ఆప్షన్ కూడా ఉంది. సెట్టింగ్స్​లో built-in option ను పెట్టుకుంటే షెడ్యూల్ ప్రకారం మీ ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్ మరింత భద్రతగా ఉంటుంది.

ఫేక్ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్​తో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్​లో నకిలీ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్​లను తీసుకొచ్చారు. ఇవి చూడడానికి అచ్చంగా ఒరిజినల్ యాప్స్ లాగానే ఉంటాయి. అందువల్ల యూజర్స్ వీటిని గుర్తించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్​ రెండూ వాట్సాప్​ లానే మెసేజింగ్ అప్లికేషన్స్. వీటికి కూడా చాలా పెద్ద యూజర్ బేస్ ఉంది. అందుకే సైబర్ నేరగాళ్లు వీటిని టార్గెట్ చేసుకున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్​లకు సంబంధించిన ఫేక్, క్లోనింగ్ యాప్స్​ను రూపొందించి, వాటిని గూగుల్ ప్లేస్టోర్​లో ఉంచారు. ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్ నుంచి మిలియన్ల కొద్దీ ఈ ఫేక్ యాప్స్​ డౌన్ లోడ్స్ జరిగినట్లు Kaspersky సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొన్నాళ్ల క్రితం గుర్తించారు.

మీరు మంచి కంటెంట్ క్రియేటరా? ఈ టాప్​-7 ఏఐ టూల్స్​పై ఓ లుక్కేయండి! - Best AI Tools for Content Creators

మీ స్మార్ట్​ ఫోన్ బాగా వేడెక్కుతోందా? ఈ టాప్​-10 టిప్స్​తో కూల్ చేసేయండిలా! - Phone Overheating

ABOUT THE AUTHOR

...view details