తెలంగాణ

telangana

ETV Bharat / technology

చిమ్మ చీకట్లో కూడా వీడియో కాల్స్- వాట్సాప్​ కొత్త ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోండిలా..!

వాట్సాప్​లో సూపర్ ఫీచర్​- చీకట్లో కూడా వీడియో కాల్స్ మాట్లాడుకోండిలా..!

By ETV Bharat Tech Team

Published : 5 hours ago

WhatsApp New Feature
WhatsApp New Feature (WhatsApp)

WhatsApp New Feature: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. వాట్సాప్‌లో తమ వినియోగదారులు వీడియో కాల్స్​ క్వాలిటీని మరింత పెంచేందుకు 'లో లైట్​ మోడ్​' పేరుతో సూపర్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్​తో తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ మెరుగైన క్వాలిటీతో వీడియో కాల్స్​ మాట్లాడుకోవచ్చు. వాట్సాప్​ తీసుకొచ్చిన ఈ ఫీచర్​ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా ఈ ఫీచర్ ఉపయోగాలేంటీ?, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? వంటి వివరాలు మీకోసం.

ఈ ఫీచర్ ఉపయోగాలేంటి?:

  • వాట్సాప్​లో వీడియో కాల్స్​ క్వాలిటీని పెంచేందుకుకే ఈ ఫీచర్​ను తీసుకొచ్చారు.
  • ఈ ఫీచర్​ గదిలో తక్కువ వెలుతురు ఉన్నా కూడా మీ ప్రియమైన వారితో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
  • మీరు వీడియో కాల్​ మాట్లాడుతున్న సమయంలో ఇది ఆటోమేటిక్​గా మీ పరిసరాల్లోని లైటింగ్​ని పరిశీలించి అందుకు అనుగుణంగా లైట్​ను అడ్జస్ట్ చేస్తుంది.
  • వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో తక్కువ వెలుతురు ఉన్నా.. ఇది మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తుంది.
  • అంటే చీకటిలో కూడా నాణ్యమైన వీడియో కాల్స్​ను ఈ ఫీచర్​ ద్వారా మాట్లాడుకోవచ్చు.
  • ఎంత చీకటిగా ఉన్నా మీరు వీడియో కాల్స్​ మాట్లాడే సమయంలో ఎదుటివారికి కన్పిస్తారు.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా?:

  • వాట్సప్‌ కొత్త 'లో లైట్​ మోడ్​' ఫీచర్​ను యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా మీ వాట్సాప్​ఓపెన్​ చేసి మీకు నచ్చినవారికి వీడియో కాల్ చేయండి.
  • మీ వీడియోను ఫుల్​ స్క్రీన్​ చేయండి.
  • ఇప్పుడు ఈ కొత్త లో లైట్​ మోడ్​ను యాక్టివేచ్ చేసుకునేందుకు కుడి వైపు కన్పిస్తున్న 'టార్చ్​' ఐకాన్​పై టాప్ చేయండి.
  • తర్వాత లైట్​ను అడ్జస్ట్ చేసేందుకు బల్బు గుర్తుపై ప్రెస్​ చేయండి.
  • ఇలా మీకు కావాల్సినంత లైటింగ్​ను సెట్​ చేసుకోవచ్చు.
  • వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
  • అయితే విండోస్​ వాట్సాప్​లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
  • కానీ యూజర్స్ వీడియో కాల్స్​లో బ్రైట్​నెస్​ పెంచుకునేందుకు అవకాశం ఉంది.
  • ప్రతి కాల్​కు తక్కువ లైట్​ మోడ్​ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీన్ని పర్మినెంట్​గా ఎనేబుల్​ చేసే ఆప్షన్​ లేదు.

చవక ధరలో మార్కెట్లోకి కొత్త మొబైల్స్- ఫ్రీ రీఛార్జ్​తో పాటు మరెన్నో..!

జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్‌ వచ్చిందా?- అయితే బీ కేర్​ ఫుల్..!​

ABOUT THE AUTHOR

...view details