తెలంగాణ

telangana

ETV Bharat / technology

కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే! - MARUTI SUZUKI PRICE HIKE

ఫస్ట్ నుంచి పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు- ఏ మోడల్​పై ఎంతంటే?

Maruti Suzuki Price Hike
Maruti Suzuki Price Hike (Photo Credit- Maruti Suzuki)

By ETV Bharat Tech Team

Published : Jan 26, 2025, 1:28 PM IST

Maruti Suzuki Price Hike:ఈ ఏడాదికొత్త కారు కొనాలనుకునేవారికి అలెర్ట్. మరికొన్ని రోజుల్లో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1, 2025 నుంచి తన కార్లు, SUVల ధరలను పెంచబోతున్నట్లు దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రకటించింది. కార్ల మోడల్స్ ఆధారంగా ఈ ధరలు పెరగనున్నాయి. వీటి పెంపు కనిష్ఠంగా రూ.1,500 నుంచి గరిష్ఠంగా రూ.32,500 వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. పాత మారుతి సియాజ్, మారుతి జిమ్మీ ధరలను అత్యల్పంగా పెంచగా మారుతి సెలెరియో, ఇన్విక్టో వంటి మోడళ్ల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు సమాచారం.

మోడల్​ను బట్టి కార్లపై ధరల పెంపు వివరాలు:

Model Price Hike
Maruti Alto K10 రూ. 19,500 వరకు పెంపు
Maruti S-Presso రూ. 5,000 వరకు పెంపు
Maruti Celerio రూ. 32,500 వరకు పెంపు
Maruti Wagon R రూ. 15,000 వరకు పెంపు
Maruti Swift రూ. 5,000 వరకు పెంపు
Maruti Dzire రూ. 10,000 వరకు పెంపు
Maruti Brezza రూ. 20,000 వరకు పెంపు
Maruti Ertiga రూ. 15,000 వరకు పెంపు
Maruti Eeco రూ. 12,000 వరకు పెంపు
Maruti Ignis రూ. 6,000 వరకు పెంపు
Maruti Baleno రూ. 9,000 వరకు పెంపు
Maruti Ciaz రూ. 1,500 వరకు పెంపు
Maruti XL6 రూ. 10,000 వరకు పెంపు
Maruti Fronx రూ. 5,500 వరకు పెంపు
Maruti Invicto రూ. 30,000 వరకు పెంపు
Maruti Jimny రూ. 1,500 వరకు పెంపు
Maruti Grand Vitara రూ. 25,000 వరకు పెంపు

ఇక ఫోర్త్ జనరేషన్ మారుతి డిజైర్‌ను కంపెనీ ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఇప్పుడు ఈ ధర పంపుతో దాని ప్రారంభ ధర ముగియనుంది. గతేడాది చివర్లో లాంఛ్ చేసిన ఈ సబ్​ కాంపాక్ట్ సెడాన్ ధరలు కొత్త సంవత్సరంతో రూ. 10,000 వరకు పెరిగాయి. మరోవైపు మారుతి బ్రెజ్జా, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా వంటి ఇతర ప్రముఖ మోడళ్ల ధరలు రూ.20,000 వరకు పెరగనున్నాయి. వీటన్నింటితో పాటు మారుతి సెలెరియో ధర అత్యధికంగా పెరుగుతుంది. వేరియంట్‌ను బట్టి ఇది రూ.32,500 వరకు పెంచనున్నారు. అదే సమయంలో మారుతి సుజుకి ఇన్విక్టో ధర రూ.30,000 వరకు పెరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details