Mahindra Veero LCV Launched: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. ఎల్సీవీ సెగ్మెంట్‌లో 3.5 టన్నుల లోపు తేలికపాటి మహీంద్రా వీరో కమర్షియల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వీరో లైట్ కమర్షియల్ వాహనాన్ని కంపెనీ మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు, ఇంజిన్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.
మహీంద్రా వీరో ఎల్సీవీ ఫీచర్లు:
- డ్రైవర్ సీట్ స్లైడ్ అండ్ రిక్లైన్,
- ఫ్లాట్ ఫోల్డ్ సీట్లు
- డోర్ ఆర్మ్-రెస్ట్‌లు
- మొబైల్ డాక్
- పియానో బ్లాక్ క్లస్టర్ బెజెల్
- డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
- హీటర్ అండ్ AC
- ఫాస్ట్ ఛార్జింగ్ USB సీ-టైప్
- 26.03 cm టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
- రివర్స్ పార్కింగ్
- కెమెరా
- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
- పవర్డ్ విండోస్
- డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ
- మైలేజ్:సీఎన్‌జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ.
- ధర:రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభం
మహీంద్రా వీరో ఎల్సీవీ ఇంజిన్:కంపెనీ మహీంద్రా వీరోను డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఇది 59.7 kW పవర్, 210 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ mDI డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. CNGతో లభించే ఈ ఇంజన్ 67.2 kW శక్తిని, 210 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.