ETV Bharat / technology

ఓలా ఎలక్ట్రిక్ యూజర్లకు గుడ్​న్యూస్- ఒకేసారి ఏకంగా 3200 స్టోర్లు.. ఇక సర్వీసులకు తగ్గేదేలే..!

ఓలా ఎలక్ట్రిక్ కీలక ప్రకటన- ఒకేరోజు కొత్తగా 3,200 స్టోర్లు ప్రారంభం..!

Ola Electric Scooters
Ola Electric Scooters (OLA Electric)
author img

By ETV Bharat Tech Team

Published : 16 hours ago

Ola Electric Store Expansion: ప్రముఖ విద్యుత్ టూ-వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తన రిటైల్‌ స్టోర్లను అమాంతం పెంచేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు 3,200 స్టోర్లను భారీ స్థాయిలో ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను ఒకేసారి ఏకంగా 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్​ ఎక్స్‌ వేదికగా సోమవారం ఓ ప్రకటన చేశారు.

"ఎలక్ట్రిక్ వెహికల్స్​కు సంబంధించి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్‌ రిటైల్ స్టోర్లను 4000 సంఖ్యకు పెంచాలని నిర్ణయించాం. మా కస్టమర్లకు మరింత చేరువకావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 20వ తేదీన దేశవ్యాప్తంగా 3,200 స్టోర్లను ఒకేసారి ప్రారంభించనున్నాం. బహుశా ఈ స్థాయిలో స్టోర్ల సంఖ్యను ఒకేసారి ప్రారంభించడం ఇదే ఫస్ట్​టైం." - భవీశ్‌ అగర్వాల్‌, ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో

విద్యుత్‌ వాహన విభాగంలో మార్కెట్‌ నంబర్​ వన్​గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌పై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సేల్స్ అనంతరం కస్టమర్లకు సేవలను అందించే విషయంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వినియోగదారులు హెల్ప్‌లైన్‌కు 10 వేలకు పైనే ఫిర్యాదులు రావడం, దీనిపై సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (CCPA) విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ పరిణామాల మధ్య కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అంతేకాక ఆయా స్టోర్లలో ఓలా ఎలక్ట్రిక్‌ సర్వీసులూ లభిస్తాయని కూడా తెలిపింది. తన స్టోర్ల సంఖ్యను పెంచుతున్న నేపథ్యంలో ఓలా చేసిన ఈ ప్రకటన అనంతరం కంపెనీ షేర్లు రాణించాయి. సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవగా.. 1.40 గంటలకు దాదాపు 5 శాతం లాభంతో ఓలా షేర్లు రూ.91.67 వద్ద ట్రేడవుతున్నాయి.

వాహన ప్రియులకు షాక్!- ఆడి కార్ల ధరలు పెంపు- ఎప్పటినుంచంటే..?

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

చీపెస్ట్ ప్రైస్, టాప్​క్లాస్​ ఫీచర్లు.. భారత్​లో మొట్ట మొదటి స్కోడా కారు కూడా ఇదే.. కేవలం రూ.7.89 లక్షలకే!

ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.