Horoscope Today December 4th 2024 : డిసెంబర్ 4వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలలో మీకు బాధ కలిగించే సంఘటనలు జరగవచ్చు. ఈ రోజంతా మిమ్మల్ని ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. బంధువులతో అకారణ వైరాలు, ఆర్ధిక సమస్యలతో విసుగుచెందుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం ద్వారా ఒత్తిడి అధిగమించి ప్రశాంతతను అలవరచుకుంటే మంచిది. ఉద్యోగులకు సహద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి పని ఒత్తిడి తప్పదు. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఆలస్యంగా కావచ్చు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. కొత్త పనులు ప్రారంభించవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల ఇంట్లో శుభ కార్యాలలో పాల్గొంటారు. సంపద, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులకు అదృష్టదాయకంగా ఉంటుంది. మంచి ప్రణాళికతో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారాలు అందుతాయి. మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. మీ పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితలతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చేపట్టిన పనులకు చక్కని ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. శ్రీరామనామ జపం రక్షిస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, బద్దకం కారణంగా కీలకమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు కోల్పోతారు. నిర్ణయాలు తీసుకునే సమర్ధత లోపిస్తుంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దూరమవుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వారసత్వపు ఆస్తికి, కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే శాంతి, సౌఖ్యం కలుగుతాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళతారు. అన్ని రంగాలవారు కృషికి తగిన ఫలితాలు పొందుతారు. ఆర్ధికంగా కలిసి వచ్చే కాలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. విఘ్న వినాయకుని ప్రార్ధిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్ఫూర్తిదాయక పుస్తకాల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలోకి అడుగు పెడతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దృఢమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధికంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక లబ్ధి ఉంటుంది. తీర్థయాత్ర చెయ్యవచ్చు. శివారాధన శ్రేయస్కరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్ధిక పరమైన లాభాలు విశేషంగా ఉంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
కుంభం (Aquarius) : కుంభరాశి ఈ రోజు శుభప్రదమైన రోజు. ఈ రాశివారికి ఈ రోజు వృత్తిపరంగా లాభించవచ్చు. స్నేహితుల ద్వారా కొత్త ప్రాజెక్టులు పొందవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఒక అనుకూల సంకేతం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. శ్రీలక్ష్మి ఆరాధన శుభకరం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సమయపాలన, క్రమశిక్షణ అవసరం. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.