ETV Bharat / technology

MG నుంచి మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు- సింగిల్ ఛార్జ్​తో 580 కి.మీ రేంజ్!​

త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'MG Cyberster'- దీని స్పీడు చూస్తే షాకే..!

MG Cyberster Electric Car
MG Cyberster Electric Car (MG Motor)
author img

By ETV Bharat Tech Team

Published : 10 hours ago

MG Cyberster Electric Car: ఇండియన్ మార్కెట్లోకి అదిరే స్పోర్ట్స్​ కారు రాబోతుంది. JSW MG మోటార్ కంపెనీ తన ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ 'MG Cyberster'ను లాంఛ్ చేయనుంది. ఈ మేరకు ఈ కారు రిలీజ్​పై ఓ క్లారిటీ ఇచ్చింది. దీన్ని జనవరి 2025లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది.

ఈ కారును జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ కంపెనీలు కలిసి రూపొందించాయి. 'ఎంజీ సైబర్‌స్టర్' ఈ సంవత్సరం మార్చిలో ఇండియాలో ప్రదర్శించారు. ఇది ఎంజీ కంపెనీ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్​ కారు. కంపెనీ తన ప్రీమియం 'ఎంజీ సెలెక్ట్' రిటైల్ ఛానెల్ ద్వారా ఈ కారును విక్రయించనుంది.

కొన్ని నెలల క్రితమే JSW MG మోటార్ ఇండియా.. తన ప్రీమియం ప్రొడక్ట్స్​ కోసం 'ఎంజీ సెలెక్ట్' అనే కొత్త రిటైల్ ఛానెల్‌ని ప్రకటించింది. ఈ డీలర్‌షిప్ ద్వారా విక్రయించే కంపెనీ మొదటి కారు కూడా ఇదే కానుంది. JSW MG మోటార్ ఇండియా ప్రారంభంలో దేశవ్యాప్తంగా 12 సెలెక్ట్ ఎక్స్​పీరియన్స్ సెంటర్లను కలిగి ఉంది. ఇప్పుడు క్రమంగా వాటి సంఖ్యను పెంచనుంది.

ఇక ఈ కారు సైజ్ గురించి చెప్పాలంటే ఇది 4,533 mm పొడవు, 1,912 mm వెడల్పు, 1,328 mm ఎత్తుతో ఇది 2,689 mm వీల్‌బేస్ కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్​ కారు అనేక ఇంటర్నేషనల్ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్యాటరీ ప్యాక్, మోటార్ వంటి రెండు ఆప్షన్లలో వస్తుంది. దీని ఎంట్రీ-లెవెల్ మోడల్​లో సింగిల్ రియర్-యాక్సిల్-మౌంటెడ్ 308hp మోటార్ ఉంటుంది. ఈ కారులో 64kWh బ్యాటరీని అమర్చారు. ఇది గరిష్టంగా 520km రేంజ్​ను అందిస్తుంది.

ఈ రేంజ్-టాపింగ్ 'సైబర్‌స్టర్' 77kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్​తో 580కిమీ రేంజ్​ ఇస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సెటప్​ను కలిగి ఉంటుంది. ఇవి 544hp పవర్, 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. సైబర్​స్టర్​ ఫుల్ ఇంపోర్టెడ్ యూనిట్​గా త్వరలో ఇండియాకు రానుంది. అయితే కంపెనీ మన మార్కెట్‌లో ఏ పవర్‌ట్రెయిన్ ఆప్షన్​ను విడుదల చేస్తుందో ఇంకా సమాచారం అందించలేదు. సైబర్‌స్టర్‌తో పాటు 'MG మిఫా ఎలక్ట్రిక్ MPV' కూడా త్వరలో తీసుకురానున్నారు.

ధర: 'MG సైబర్‌స్టర్' ధర విషయానికొస్తే ఇది రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.

మార్కెట్లో పోటీ: ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌ కారుకు ఇండియన్ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు ఎవరూ ఉండరు. అయితే ధర పరంగా ఇది.. BYD సీల్, హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6 కార్లతో పోటీపడుతుంది.

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

లేటెస్ట్ ప్రాసెసర్, హై ఎండ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. ప్రీమియం ఫీచర్లతో 'వన్​ప్లస్ 13' వచ్చేస్తోంది..!

ఓలా ఎలక్ట్రిక్ యూజర్లకు గుడ్​న్యూస్- ఒకేసారి ఏకంగా 3200 స్టోర్లు.. ఇక సర్వీసులకు తగ్గేదేలే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.