One Student and One Teacher In Warangal School : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి శివారులోని కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఏడో డివిజన్ పరిధిలోని కోనాపురంలో 50 కుటుంబాలు ఉండగా, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పిల్లలను వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి ఎలికట్టె శ్రేయస్ ఒక్కడే చదువుకుంటున్నాడు. ఈ విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు ఒక్కరే ఉపాధ్యాయుడు జగన్ మోహన్ వర్ధన్నపేట నుంచి సుమారు 5 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చి వెళ్తున్నారు.
ఆ స్కూల్లో ఒకే విద్యార్థిని - ఒకే ఉపాధ్యాయుడు - ఎక్కడంటే?
పాఠశాలలో రెండు గదులు ఉండగా, ఒక తరగతిలో అంగన్‌వాడీ కేంద్రం, మరో గదిలో పాఠశాలను నడుపుతున్నారు. దీంతో పాటు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. ఎస్సీ బాలికల వసతి గృహం, ఎస్టీ గురుకుల బాలికల విద్యాలయం, ఎస్టీ బాలుర వసతి గృహం ఉండటంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో ప్రస్తుతం 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో అయిదుగురు వచ్చే సంవత్సరం ఒకటో తరగతిలోకి వస్తారని ఉపాధ్యాయుడు చెప్పారు.
ఐదుగురు విద్యర్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు : కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ తరగతులు జరగడం లేదు. మొత్తంగా ఆరో తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలోనూ రోజూ ఇద్దరు లేదా ముగ్గురే పాఠశాలకు వస్తున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది విద్యార్థులు ఉండేవారు. గతేడాది నలుగురు విద్యార్థులు పదో తరగతి పూర్తి చేశారు. పదో తరగతికి రావాల్సిన ఒక్క విద్యార్థి కూడా వేరే పాఠశాలలో ప్రవేశం పొదడంతో ఆ తరగతిలో విద్యార్థులు లేకుండా పోయారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ చేస్తున్నారు.
సంస్కృతం ఎగ్జామ్‌కు ఒకే ఒక్క విద్యార్థిని- డ్యూటీలో 8 మంది సిబ్బంది!