ETV Bharat / technology

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో- సూర్యుడి గుట్టు విప్పేందుకు 'ప్రోబా-3' రెడీ..!

Proba-3 mission
Proba-3 mission (ISRO)
author img

By ETV Bharat Tech Team

Published : 17 hours ago

ISRO PROBA 3 Mission: ఇస్రో మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా ఇస్రో.. డిసెంబర్ 4న రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.

ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3 మిషన్​లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 4:06 గంటలకు ఈ రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రయోగం కోసం ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ XL వెర్షన్​ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం ఐదు PSLV వేరియంట్స్​లో ఇది మోస్ట్ పవర్​ ఫుల్ రాకెట్. ఈ రాకెట్ సాధారణ PSLV కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సాధారణ PSLV రాకెట్​ 4 బూస్టర్లను మాత్రమే ఉండగా.. ఇది 6 పెద్ద బూస్టర్లను కలిగి ఉంటుంది.

దీని ఒక్కో బూస్టర్ 12 టన్నుల ప్రొపెల్లెంట్ (రాకెట్​కు ఫ్యూయెల్ వంటిది) క్యారీ చేయగలదు. PSLV-XL రాకెట్ అనేది భారతదేశపు మొట్ట మొదటి లిక్విడ్ ఫేజ్ వెహికల్. ఇది ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ రెండింటినీ ఉపయోగించుకుంటుంది. ఈ రెండు రకాల ఫ్యూయెల్స్ కలయిక వల్ల రాకెట్‌కు ఎక్స్​ట్రా పవర్ లభిస్తుంది. దీంతో ఇది నార్మల్ PSLV రాకెట్ కంటే ఎక్కువ బరువున్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.

ఈ మేరకు ఈ 'PSLV-C59/Proba-3' మిషన్​ కోసం కోసం అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ సిద్ధంగా ఉందని ఇస్రో 'X'లో తెలిపింది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మిషన్. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది.

ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం?: ఈ ప్రోబా-3 మిషన్ ప్రయోగం సూర్యుని బయటి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం PSLV-XL రాకెట్ ఈ ESA 'ప్రోబా-3' ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఈ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొట్ట మొదటిసారని ESA తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 3:08 గంటలకు ప్రారంభమయింది.

తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!

2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?

భారత్ అణుబాంబు మిస్సైల్ టెస్ట్ సక్సెస్- భూమి, ఆకాశంలోనే కాదు.. సముద్రం నుంచి కూడా సై..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.