Mahindra BE 6e vs Tata Curvv EV: ప్రపంచ వ్యాప్తంగా ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో వీటిని వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూయెల్ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరగడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఈవీ కార్లను లాంఛ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా దేశీయ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా బుధవారం రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 'XEV 9e', 'BE 6e' కార్లను తీసుకొచ్చింది. వాటిలో 'XEV 9e' కారును రూ. 21.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్ అయింది. ఇక మహీంద్రా 'BE 6e' కారును కంపెనీ 18.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది.
వీటిలోని మహింద్రా 'BE 6e' ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఇటీవల లాంఛ్ అయిన టాటా 'కర్వ్ ఈవీ'కి గట్టి పోటీని ఇస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ కారు బెస్ట్ ఆప్షన్?, దేని రేంజ్ ఎక్కువ? ఎందులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
Mahindra BE 6e vs Tata Curvv EV: కొలతలు
Model | Mahindra BE 6e | Tata Curvv EV |
Length | 4,371 mm | 4,310 mm |
Width | 1,907 mm | 1,810 mm |
Height | 1,627 mm | 1,637 mm |
Wheelbase | 2,775 mm | 2,560 mm |
Ground Clearance | 207 mm | 186 mm |
Boot Space | 455 litres | 500 Litres |
Frunk Storage | 45 Litres | 11.5 litres |
Turning Circle | < 10 meters | 10.7 metres |
Wheel Size | 18-inch/19-inch/20-inch | 17-inch/18-inch |
Mahindra BE 6e vs Tata Curvv EV: బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్
Model | Mahindra BE 6e | Tata Curvv EV |
Battery Capacity | 59kWh/79kWh | 45kWh/55kWh |
Range (ARAI-Certified) | 535km/682km | 430km/502km |
Charging option | 11.2kW/7.2kW AC charger | 7.2kW AC charger |
AC Charging Time (7.2kW) | 8.7 hours/11.7 hours | 6.5 hrs/7.9 hrs |
AC Charging Time (11.2kW) | 6 hours/8 hours | - |
DC charging time | 20 minutes (175kW, 20-80 percent) | 40 minutes (70kW, 10-80 percent) |
Battery Warranty | Lifetime | 8-years/1,60,000 km |