తెలంగాణ

telangana

ETV Bharat / technology

చవక ధరలో మార్కెట్లోకి కొత్త మొబైల్స్- ఫ్రీ రీఛార్జ్​తో పాటు మరెన్నో..! - JIOBHARAT SERIES NEW PHONES

జియో కొత్త ఫోన్స్ లాంచ్- ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరంతే..!

Jiobharat Series New Phones
Jiobharat Series New Phones (ANI)

By ETV Bharat Tech Team

Published : Oct 15, 2024, 7:41 PM IST

Jiobharat Series New Phones: రిలయన్స్ జియో మార్కెట్లోకి సరికొత్త మొబైల్స్​ను తీసుకొచ్చింది. దిల్లీలో నిర్వహించిన ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ 2024 (IMC) ఈవెంట్‌లో జియోభారత్ సిరీస్‌లో వీ3, వీ4 ఫోన్‌లను ఆవిష్కరించింది. గతేడాదిలో వీ2 పేరిట తీసుకొచ్చిన ఫోన్‌కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఇదే సిరీస్‌లో మరో రెండు మొబైల్స్‌ తీసుకొచ్చింది. 2G ఫీచర్ మొబైల్స్ ఉపయోగించే యూజర్స్​ను 4G డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ రెండు మొబైల్స్ రూపొందించింది. ఇవి చూసేందుకు చాలా సింపుల్​ డిజైన్​లో ఉన్నా లేటెస్ట్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

బ్యాటరీ అండ్ స్టోరేజ్:

  • జియోభారత్ సిరీస్‌ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీతో వస్తున్నాయి.
  • వీటిలో 125GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • అంతేకాక ఈ మొబైల్​ ఫోన్స్​ 23 ఇండియన్ లాంగ్వెజెస్​కు సపోర్టు చేస్తాయి.
  • ఈ రెండు మోడల్స్​ ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్​ను పొందుతారు.
  • జియో టీవీ యూజర్స్ ఈ మొబైల్స్​ ద్వారా తమకు ఇష్టమైన షోస్, న్యూస్ లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించేందుకు 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్‌ యాక్సెస్‌ పొందుతారు.

వీటి ధర:

  • జియోభారత్ ఈ రెండు మొబైల్స్​ ధర కేవలం రూ.1099 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.
  • అమెజాన్‌, జియో మార్ట్‌తో పాలు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్స్​లో వీటిని కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.

ఫ్రీ రీఛార్జ్:

  • జియోభారత్ ఈ ఫీచర్‌ ఫోన్‌ కొన్నవాళ్లకి రూ.123 రీఛార్జి ప్లాన్‌ ఉచితంగా ఇస్తోంది.
  • ఈ ప్లాన్ ద్వారా నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, 14 GB వరకు డేటా అదనంగా పొందొచ్చు.
  • జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి ప్రీ- ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఈ మొబైల్స్ వస్తున్నాయి.
  • జియో తక్కువ ధరలో అందించే జియో భారత్‌ ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లతో వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.
  • జియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో డిజిటల్ పేమెంట్లుసులభంగా చేసుకునేందుకు కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి.
  • జియోచాట్ వినియోగదారులు అన్‌లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్​ను పొందుతారు.
  • తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ అయేందుకు ఈ ఫోన్స్ ఉపయోగపడనున్నాయి.

జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్‌ వచ్చిందా?- అయితే బీ కేర్​ ఫుల్..!

ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్​.. ఇకపై ట్రాఫిక్​ టెన్షన్​కు చెక్​..!

ABOUT THE AUTHOR

...view details