ETV Bharat / state

మెచ్చిన కారుకు నచ్చిన నంబరు​ - ఖర్చు విషయంలో అసలు తగ్గేదే లే! - DEMAND FOR VEHICLE FANCY NUMBERS

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్లకు పెరిగిన పోటీ - రవాణా శాఖకు ఒక్క రోజు ఆదాయం రూ.5లక్షలు

Increasing Demand for Fancy Registration Numbers of Vehicles
Increasing Demand for Fancy Registration Numbers of Vehicles (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 10:48 PM IST

Increasing Demand for Fancy Registration Numbers of Vehicles : రోజురోజుకు మార్కెట్లోకి ఎన్నో ఫీచర్స్‌ ఉన్న వాహనాలు వస్తుంటాయి. కొందరు వారికి నచ్చిన వాహనాన్ని కొనేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. అలాంటి వారు రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా స్పెషల్‌గా ఉండాలి అనుకుంటారు. ఖర్చు అయినా పర్లేదు ఇష్టమైన కారు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ నంబరు దగ్గర వెనక్కి తగ్గేదే లే అంటారు. వేలం ద్వారా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడానికి వెనుకాడరు. వీరు ఉత్సాహంతో రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది.

ఇదేం క్రేజు రా నాయనా - ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.19 లక్షలు ​- TG సిరీస్ మేనియా మామూలుగా లేదుగా - TG 09 A 9999 FANCY NUMBER CRAZE

ఆ నంబర్‌కు అత్యధిక ధర : కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ గురువారం 6 నంబర్లకు రూ.1,35,000 ఫీజు నిర్దేశించి ఆన్‌లైన్‌లో వేలం చేపట్టింది. పలువురు పోటీపడి వాటిని దక్కించుకోగా రవాణా శాఖకు ఒక్కరోజు ఆదాయం రూ.5.06 లక్షలు సమకూరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీఎస్‌ స్థానంలో టీజీని ప్రవేశపెట్టింది. ఆ సీరిస్‌ వచ్చిన అనంతరం కరీంనగర్‌ రవాణా శాఖ కార్యాలయం పరిధిలో ఆన్‌లైన్‌ వేలంలో టీజీ 02 9999 అత్యధిక ధర వచ్చింది. గురువారం నుంచి టీజీ బి.0001 సిరీస్ మొదలైంది. దీంతో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ వచ్చిందని, వాటి కోసం పోటీ పెరిగిందని ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ పెద్దింటి పురుషోత్తం తెలిపారు.

ఫ్యాన్సీ నంబర్ల ఆదాయం ఇలా (రూ.లలో)
నంబర్‌ రుసుము వెచ్చించిన మొత్తం
టీజీ 02 9999 50,000 3,30,930
టీజీ 02 0001 50,000 75,000
టీజీ 02 0003 10,000 22,116
టీజీ 02 0004 5,000 21,116
టీజీ 02 0006 10,000 16,052
టీజీ 02 0007 10,000 41,2000

మీ వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కావాలా ? ఇలా బుక్​ చేయండి! - How To Book VIP Number For Vehicle

టీజీ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లకు పెరుగుతోన్న డిమాండ్ - ఒక్కరోజే సుమారు రూ. 44 లక్షల ఆదాయం - Huge Amount Spent TG Fancy Numbers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.