ETV Bharat / sports

4వ టీ20లో శతకొట్టిన సంజూ శాంసన్, తిలక్ వర్మ - పగిలిన లేడీ ఫ్యాన్​ దవడ! - TEAMINDIA VS SOUTH AFRICA 4TH T20I

దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచిన టీమ్ ఇండియా.

TeamIndia VS South Africa 4th T20I
TeamIndia VS South Africa 4th T20I (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 15, 2024, 10:26 PM IST

Updated : Nov 15, 2024, 10:40 PM IST

TeamIndia VS South Africa 4th T20I : జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతోన్న ఆసక్తికర సమరం నాలుగో టీ20లో టీమ్ ఇండియా దూకుడు ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​, ప్రత్యర్థి జట్టు ముందు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్లలో సంజూ శాంసన్, తిలక్​ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ చెరో సెంచరీతో శతకొట్టడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో వికెట్​ కోల్పోయి 283 పరుగులు చేసింది టీమ్ ఇండియా. అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పర్వాలేదనిపించాడు. లూథో సిపమ్లా ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాపై టీమ్​ ఇండియా ఇదే అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్‌గా రెండో అత్యధిక స్కోరు.

తొలి ప్లేయర్​గా సంజూ - ఈ మ్యాచ్​లో (109; 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు శాంసన్​. ఇంకా ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక తిలక్​ వర్మ (120; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్​లో 41 బంతుల్లో శతకం అందుకున్నాడు.

పగిలిన లేడీ ఫ్యాన్​ దవడ!(Samson Hit Lady fan With Ball) - సంజూ శాంసన్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌తో గ్యాలరీలో ఉన్న ఓ మహిళా అభిమానికి గాయమైంది. శాంసన్ సిక్సర్ ధాటికి ఓ లేడీ ఫ్యాన్ దవడ పగిలింది! ఆమెకు నొప్పితో విలవిలలాడింది. ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్నీటి పర్యంతమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు మహిళా అభిమానికి దెబ్బ తగిలిన విషయాన్ని గుర్తించిన సంజూ శాంసన్ ఆమెకు సైగలతో క్షమాపణలు కూడా చెప్పాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 10వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మైక్ టైసన్ VS జేక్ పాల్ మెగా ఫైట్​కు వేళాయే - భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు లైవ్‌ చూడొచ్చంటే?

IPL 2025 మెగా వేలం ప్లేయర్ల ఫైనల్ లిస్ట్ ఇదే - మొత్తం ఎంత మంది అంటే?

Last Updated : Nov 15, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.