Conveyor Belt Road: సరకు రవాణా విషయంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ట్రక్కు డ్రైవర్ల కొరతను తీర్చేందుకు టోక్యో, ఒసాకా మధ్య సరుకు రవాణా కారిడార్‌ను నిర్మించాలని యోచిస్తోంది. దీనికి 'కన్వేయర్ బెల్ట్ రోడ్' అని పేరు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో, ఎంత మంజూరు చేశారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
జపాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఆటో ఫ్లో రోడ్ అని పేరు పెట్టిన థ్రీ-లేన్ కారిడార్‌లో భారీ కంటైనర్లు కదులుతున్నట్లు కన్పిస్తుంది. దీన్ని 2027 లేదా 2028లో పరీక్షించనున్నారు. 2030 మధ్యలో ఈ ప్రాజెక్టు పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని జపాన్ ప్రభుత్వం తెలిపింది.
రోడ్డు నెట్‌వర్క్‌లో లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక స్థలాలను క్రియేట్ చేయడమే ఈ ఆటో ఫ్లో రోడ్ కీ కాన్సప్ట్. దీనిలో భాగంగా 24 గంటల ఆటోమేటెడ్, మానవరహిత రవాణా వ్యవస్థలను అమలు చేస్తోంది. తగ్గిపోతున్న శ్రామిక శక్తిని భర్తీ చేయడం, డ్రైవర్ల పనిభారాన్ని తగ్గించడంతోపాటు ఈ వ్యవస్థ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని జపాన్ ప్రభుత్వం తెలిపింది.
జపాన్‌లో ఫోర్క్లిఫ్ట్లను ఉపయోగించి లోడింగ్ ఆటోమేటెడ్ అవుతుంది. ఇది విమానాశ్రయాలు, రైల్వేలు, ఓడరేవులతో అనుసంధానించి ఉంది. ఈ బాక్స్‌లు 180 సెం.మీ ఎత్తు, 110 సెం.మీ వెడల్పు, 110 సెం.మీ పొడవు కలిగిన పెద్ద గది పరిమాణంలో ఉంటాయి. అన్నీ అనుకూలిస్తే ఇవి ఇతర మార్గాలకూ విస్తరించొచ్చు. భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ, డ్రైవర్లు లాస్ట్‌లో ప్రజలకు డోర్ డెలివరీలు చేయాల్సి ఉంటుంది.